న్రూతన పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం తగదు


Thu,April 18, 2019 12:13 AM

- దరఖాస్తులను పరిశీలించి అనుమతులివ్వాలి
- నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించండి : ఇన్‌చార్జి కలెక్టర్ డి.వేణుగోపాల్

వనపర్తి కలెక్టరేట్ : జిల్లాలో నూతనంగా నెలకొల్పే పరిశ్రమల విషయంలో జాప్యం తగదని ఇన్‌చార్జి కలెక్టర్ డి.వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టర్ ఛాంబర్లో టీఎస్-ఐపాస్, టీ ప్రై డ్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు వచ్చిన దరఖాస్తులను, ఇప్పటివరకు ఇ చ్చిన అనుమతులను పరిశీలించారు. దరఖాస్తులను క్షు ణ్ణంగా పరీశీలించి నిర్ధేశించిన సమయంలోగా అనుమతులివ్వాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించారు. టీ ప్రైడ్ కింద ఔ త్సాహిత పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ఇన్సెంటివ్స్‌పై సమీ క్ష నిర్వహించి ఇప్పటి వరకు టీఎస్ ఐపాస్ కింద 117 దరఖాస్తులు వచ్చాయని, ఆయా శాఖల ద్వారా 112 అనుమతులను ఇవ్వడం జరిగిందని, నాలుగు అనుమతులను పరిశీలించి తిరస్కరించారని, ఒకటి పెండింగ్‌లో ఉందని తెలిపారు.

పెండింగ్‌లో ఉన్న వాటిని తక్షణమే పరీశీలించి పరిష్కరించాలని మండలి అధికారులను ఆదేశించారు. టీప్రైడ్ కింద 75 ట్రాన్స్‌పోర్ట్ యూ నిట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అం దులో రూ.77,45,749 తో 32 మంది ఎస్సీలకు, రూ.80,15,636 వ్యయంతో 28 మంది ఎస్టీలకు, రూ.36,55,611 విలువ గల 15 యూనిట్లను ది వ్యాంగ లబ్ధిదారులకు మంజూరు చేసినట్లు తెలిపారు. టీఎస్ ఐపాస్, టీప్రైడ్ కింద ప్రభుత్వం అందిస్తున్న స బ్సిడీలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. సమావేశం లో జిల్లా పరిశ్రమల అభివృద్ధి అధికారి నరేష్ కుమార్, ఎల్‌డీ సురేష్ కుమార్, గనుల శాఖ ఏడీ శామ్యూల్ జాకబ్, డీపీవో రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ రజినీకాంత్ రెడ్డి, జలవనరుల శాఖ జియాలజిస్టు యుగంధర్, సహాయ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సతీష్, షె డ్యూల్డ్ కులాల ఇన్‌చార్జి అభివృద్ధి అధికారి వెంకటస్వా మి, రిజిస్ట్రార్ కార్యాలయ అధికారి శాంతకుమారి, వి ద్యుత్ శాఖ ఏఈ అరుణ్ కుమార్, ఫైర్ డిపార్ట్‌మెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ కేశవులు, డీటీ వెంకటేశ్వర్లు ఉన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...