ప్రభుత్వ దవాఖానలో ఒకే రోజు 17 ప్రసవాలు


Wed,April 17, 2019 02:16 AM

-5 మంది మగ శిశువులు, 12 మంది ఆడ శిశువుల జననం
మక్తల్, నమస్తే తెలంగాణ ః తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడంతో రోజురోజుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అందులో భాగంగా మక్తల్ ప్రభుత్వ ఆసుప్రతిలో మంగళవారం 17 ప్రసవాలు జరగగా అందులో 14 సిజేరియన్లు జరగడం జరిగిందని నారాయణపేట డిఎంఅండ్‌హెచ్‌వో డా. సౌభాగ్యలక్ష్మి పేర్కొన్నారు. 17 ప్రసవాలల్లో 14 సిజేరియన్, 2 నార్మల్ కాగా ఒక డెలివరీలో ఇద్దరు మగ శిశువులు జన్మించగా వారు గ్రహణమొర్రి (అంగవైకల్యం)తో జన్మించడం జరిగిందన్నారు. 12 మంది ఆడ శిశువులు, 5 మంది మగ శిశువులు జన్మించడం జరిగిందన్నారు.

మాతా శిశుమరణాలను తగ్గించేందుకు చర్యలు చేపడుతాం...
మాతా శిశుమరణాలు తగ్గించాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ ఆదేశాల మేరకు మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీలతో పాటు సిజేరియన్లు సైతం చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ప్రసవం ప్రభుత్వ ఆసుప్రతిలోనే జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ప్రతి గర్బిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుప్రతికి వచ్చి ప్రసవం పొందేలా సిబ్బందితో అవగాహణ కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఎక్కువ శాతం గర్బిణీస్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకోకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకోవడం ద్వారా చాలా మంది ప్రసవ సమయంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నయని పేర్కొన్నారు. ప్రతి మహిళ గర్బం దాల్చినప్పటి నుండి ప్రభుత్వ ఆసుప్రతిలో చికిత్సలు నిర్వహించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం పొంది ప్రభుత్వం నుండి వచ్చే ప్రోత్సాహకానికి అర్హులు కావాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులను ఏర్పాటు చేసి తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండే విధంగా నేడు ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలోనే మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచి మొదటి స్థానంలో ఉంచే విధంగా చర్యలు చేపడుతున్నమని డిఎంఅండ్‌హెచ్‌వో డా. సౌభాగ్యలక్ష్మి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమణ, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...