ముస్లీం మైనార్టీలలో బాల్య వివాహాలను అరికట్టాలి


Wed,April 17, 2019 02:16 AM

-ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కేవీ చంద్రశేఖర్‌రావు
గద్వాల క్రైం : ముస్లీం మైనార్టీలలో అక్కడక్కడ జరిగే బాల్య వివాహాలను అరికట్టాలని ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేవీ చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన గద్వాలలో మంగళవారం ఖాజీలు, ముస్లీం నాయకులు, మజీద్ కమిటీల జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ మైనార్టీలలో ఆడిబిడ్డల చదువుకు పెద్ద పీఠ వేయాలన్నారు. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చిన్నతనంలో వారికి పెళ్లిళ్లు చేసి ఇబ్బందులకు గురిచేయరాదని సూచించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. మేజర్ అయ్యేంత వరకు వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా బాగా చదివించాలన్నారు. ఉన్నత చదువులను చదివించినపుడే ఆ చిన్నారులకు తల్లిదండ్రులపై గౌరవం..ప్రేమాప్యాయతలు పెరుగుతాయన్నారు. ముస్లీ మైనార్టీ నాయకులు, ఖాజీలు కూడా బాల్య వివాహాలపై అవగాహన సదస్సులు నిర్వహించి అందరిలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డు ఇన్స్‌పెక్టర్ సిరాజ్‌పాష, బర్డ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బాలరాజారావు, ఎన్జీవో కో ఆర్డినేటర్ కమల, న్యాయవాదులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...