ఆపాత మధురం-అపూర్వసంగమం


Wed,April 17, 2019 02:15 AM

-56 యేండ్ల తర్వాత కలుసుకున్న గాంధీరోడ్ స్కూల్ పూర్వ విద్యార్థులు
-జ్ఞాపకాలు పంచుకున్న 1963 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ విద్యార్థులు
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : వీరంతా డ్బ్బై ఆరేడ్లకు పై బడిన వారే. ప్రభుత్వ ప్రయివేటు రంగ సంస్థలలో వివిధ హోదాలలో పనిచేసి పదవి విరమణ పొందిన వారు కొందరైతే వ్యాపార, రాజకీయ రంగాలలో స్థిరపడిన వారు కొందరైతే వ్యాపార, రాజకీయ రంగాలలో స్థిరపడిన వారు మరికొందరు అందరు కలిసి ఆపాత మధురం-అపూర్వసంగమంలా పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. 56 యేండ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని గాందీరోడ్ ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌సీ చదువుకున్న పూర్వ విద్యార్తులు చిన్నపాటి స్నేహితులను కలుసపుకునేందుకు కోసం మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగోండలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్‌లో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వారు నాటి మధుర క్షణాలను స్మరించుకుంటు ఒక్కరినీ మరోకరు ఆరోగ్య పరిస్థితులను అడిగు అప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరి క్షేమ సమాచారాలు మరోకరు తెలుసుకుంటు తన్మయత్వానికి తోనైయ్యారు. 1963 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన నర్సింహ్మారెడ్డి, బాలయ్య, ముత్యాల ప్రకాష్, రాఘవులు గౌడ్, తదితరులు గాంధీరోడ్డు ఉన్నత పాఠశాలలో చదివిన తమ బ్యాచ్ సహచారుల సమాచారాన్ని సేకరించి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబాల స్థితి గతులతోపాటు పాఠశాలల చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటు తమ అనుభవాలను పంచుకున్నారు. మరణించిన, ఆనారోగ్యంతో బాదపడుతున్న సహచరుల వివరాలను తెలుసుకుని ఆవేధనకు గురయ్యారు. ప్రతి యేటా కలుసుకోవాలని, నిర్ణయించుకున్నట్లు కార్యక్రమాన్ని సమన్వయం చేసిన నర్సింహ్మారెడ్డి,బాలయ్య, గోపాల్‌రెడ్డి, ముత్యాల ప్రకాష్, రాఘవులు గౌడ్ తెలియజేశారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...