మలేషియా ఎన్నారై సేవలు అభినందనీయం


Wed,April 17, 2019 02:15 AM

- రైతులు అవలంబించే అత్యాథునిక పద్దతులను పరిశీలించిన మంత్రి
-మంత్రికి ఘన స్వాగతం పలికిన టీఆర్‌ఎస్ మలేషియా ఎన్నారై విభాగం
-రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి, నమస్తే తెలంగాణ ః ఏజెంట్ల చేతిలో మోసపోయిన భాదితులకు , అనుకోకుండా మరణించిన వారి పార్థివ దేహాలను స్వదేశానికి తరలించడంలో తెరాస మలేషియా ఎన్నారై విభాగం చేస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మలేషియాలోని వ్యవసాయ క్షేత్రాల అధ్యయానానికి వెళ్లిన మంత్రి నిరంజన్ రెడ్డి అక్కడి రైతులు అవలంభించే అత్యాధునిక పద్దతులను మంత్రి స్వయంగా పరిశీలించి పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా సందర్శించారు.

అనంతరం టీఆర్‌ఎస్ మలేషియా ఎన్నారై విభాగం ఆధ్యక్షుడు చిరుత చిట్టిబాబు ఆధ్వర్యంలో కౌలాలంపూర్ లో ఏర్పాటు చేసిన సమావేశాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మంత్రి నిరంజన్ రెడ్డి టీఆర్‌ఎస్ ఎన్నారై విభాగం సభ్యులు ఘన స్వాగతం పలికారు. మంత్రి నిరంజన్ రెడ్డి తన అనుభవాలను న్నారైలతో కలసి పంచుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... విదేశియుల చేతిలో మోసపోయిన భాదితులకు టీఆర్‌ఎస్ మలేషియా ఎన్నారై విభాగం అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకుని అభినందించారు. తెరాస మలేషియా హెల్ప్‌లైన్ నెంబర్ + 601118772234 ద్వారా ప్రజలకు ఎల్లవేళ్లలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు స్పందించడం జరుగుతుందని అక్కడి టీఆర్‌ఎస్ ఎన్నారై విభాగం తెలిపింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాక్షులు మారుతికుర్మ, జనరల్ సెక్రటరి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటి సభ్యులు మునిగిల అరుణ్, రమేష్ బోయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి, జీవన్, రమేష్, సందీప్‌కుమార్, సత్యనారాయణ, రవితేజ, రఘునాథ్ నాగబండి, రవిందర్ ఇతర సభ్యులు తదితరులు ఉన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...