ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన కారు..


Wed,April 17, 2019 02:15 AM

- ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
- ముగ్గురికి గాయాలు
- తప్పిన ఫెను ప్రమాదం
మూసాపేట ః ట్రాక్టర్‌ను కారు ఢీ కొట్టిడంతో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికి అక్కడే మృతి చెందడంతో పాటు మరో ముగ్గిరికి గాయాలు అయ్యాయి. స్థానికులు, ఎస్సై మధుసుదన్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సూర్తితండాకు చెందని ముడావత్ కిష్ట్య (40)కు సిమెంట్ కాంక్రిట్ మిల్లలు ఉంది. అతని మిల్లర్ మూసాపేటలో ఉండడంతో తీసుకొని రావడానికి ట్రాక్టర్ తీసుకొని హైదరాబాద్ వైపు నుంచి మూసాపేటకు వస్తున్నాడు. మార్గ మధ్యలో మూసాపేట జాతీయ రహదారి వద్దకు రాగానే ఆంద్రపదేశ్ రాష్ట్రంలోని కడపకు చెందిన ఎనుగు కృష్ణారెడ్డితో పాటు, మరో వ్యక్తి కారులో హైదరాబాద్ నుంచి కడపకు వెళ్తూ వెనక నుంచి ట్రాక్టర్‌ను వేగంగా డీ కొట్టాడు. దీంతో ట్రాక్టర్ అదుపు తప్పి కుడివైపుకు దుసుకెళ్లడంతో రోడ్డు మధ్యలో ఉన్న ఢివైడర్‌ను ఢీ కొని ట్రాక్టర్ బోల్తా పడింది.

దీంతో ట్రాక్టర్ నడుపుతున్న ముడావత్ కిష్ట్య అక్కడికి అక్కడే మృతి చెందగా, ట్రాక్టర్‌పై ఉన్న మరో వ్యక్తి హన్మంతుకు కాలు విరగడంతో పాటు, తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చికిత్స నిమిత్తం జిల్లా ధవాఖానకు తరలించారు. అదేవిధంగా ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన వెంటనే కారులో బెలూన్‌లు బయటకు రావడంతో కారులు ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. కారు ముందు భాగంగ పూర్తిగా ధ్వంసం అయ్యింది. కారు రోడ్డు మధ్యలో నిలిచిపోడంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు కొంత సమయం నిలిచిపోయాయి. ఎస్సై మధుసుదన్‌గౌడ్ సంఘటన స్ధలానికి వచ్చి ప్రమాదంపై ఆరా తీశాయడంతో పాటు, రోడ్డు మధ్యలో ఉన్న వాహనాలను తొలగించారు. మృతుడికి భార్య ముడావత్ దేవి (దేవమ్మ), ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తేలు ఉన్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుసుదన్‌గౌడ్ తెలిపారు. కిష్ట్య మృతదేహాన్ని శవ పరీక్షల కోసం జిల్లా ధవాఖానకు తరలించారు.

- తప్పిన ఫెను ప్రమాదం..
ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను కారు డీ కొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడినప్పుడు ట్రాక్టర్ డీజల్ ట్యాంకు పగిలిపోయింది. అందులో ఉన్న డీజల్ మొత్తం బయటకు విరజిమ్మింది. ఆ సమయంలో మంటలు వచ్చి ఉంటే ట్రాక్టర్ తో సహ మృతుడు కిష్ట్య, గాయపడిన హన్మంతుకు మంటల్లో పడి కాలిపోయోవారు. అంతే కాకుండా కారు డిక్కిలో సిలిండ్ ఉంది. కారు డీ కొట్టిన సమయంలో ఆ సిలిండ్ పెలి ఉంటే కారుతో పాటు, ట్రాక్టర్ కాలిపోవడంతో పాటు, అందులో ఉన్న అందరు మృతి చెందె అవకాశం ఉండేది. కానీ అలాంటిదేది జరగకపోవడంతో ఫెను ప్రమాదం తప్పిందని స్థానికులు వాపోయారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...