అక్రమ లే అవుట్ దారులపై చర్యలు తీసుకుంటాం


Wed,April 17, 2019 02:14 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : జిల్లా పరిధిలోని వివిధ ప్రధాన ప్రాంతాలలో వెలిసిన అక్రమ లే అవుట్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం తన ఛాంబర్లో మున్సిపల్ కమిషనర్ రజినీకాంత్‌రెడ్డి తెలిపారు. నల్ల చెరువు శివారులోని సర్వే నెంబర్ 504, 505, నాగవరంలో గల కొత్తకోట రోడ్డులో సర్వే నెంబర్ 267, 268, 269, వనపర్తిలో శ్రీనివాస పురం, మెట్టుపల్లి, రాజనగరం, నర్సింగాయపల్లి సర్వే నెంబర్ 136, 138లలో అనధికారికంగా వెలిసిన లే అవుట్‌లలో ప్రజలు ప్లాట్లను కొనుగోలు చేయకూడదని తెలిపారు. వాటికి మున్సిపాలిటీ కార్యాలయం నుంచి ఎలాంటి అనుమతులు లేవని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలి టీ అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన లే అవుట్‌ల యాజమానులపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 2015 అక్టోబర్ 28వ తేదీలోపు రిజిస్టేషన్ అయినటువంటి ప్లాట్లకు మాత్రమే మున్సిపాలిటీ నుంచి అనుమతులు ఇవ్వబడునని తెలిపారు. డీటీసీపీ హైదరాబాద్ వారి అనుమతి పొందిన లేఅవుట్‌లోని ప్లాట్లకు మాత్రమే అనుమతి ఇవ్వబడునని అట్టి వాటినే ప్రజలు కొనుగోలు చేయాలని సూచించారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...