వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుందాం


Wed,April 17, 2019 02:14 AM

కొత్తకోట : వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుందామ ని డీసీసీబీ ఉమ్మడి జిల్లాల డైరెక్టర్ రావుల సురేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మం డలంలోని కానాయపల్లిలో గ్రా మానికి చెందిన కాంగ్రెస్, టీడీపీల నుంచి సుమారు 100 మంది రావుల సురేంద్రనాథ్‌రె డ్డి, రావుల ఉపేంద్రనాథ్‌రెడ్డి ఆ ధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరా రు. ఎంపీపీ మౌనిక, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు వామన్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, సీడీసీ చైర్మన్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పా రు. ఈ సందర్భంగా సురేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో చేరిన కార్యకర్తలు ఐక్యంగా ఉండి కలిసిమెలిసి బలోపేతం చేసుకుందామన్నారు. అభ్యర్థులు ఎవ్వరైనా స రే గెలుపుకోసం అహర్నిషలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కానాయపల్లిలోని ఆర్‌ఆండ్‌ఆర్ సమస్య పరిష్కా రం కావాలంటే అధికార పార్టీని గెలిపించుకోవాలని సూ చించారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సహకారంతో గ్రా మాభివృద్ధికి పాటుపడదామన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో చంద్రయ్య, తిరుపతి, సందీప్, రవి, దానియేలు, కిశోర్, బాలరాజు, జగన్, శ్రీను, రాములు, మన్నెం, అ నిల్, మల్లేష్, వెంకటేష్, ఆంజనేయులు, బాలరాజు తదితరులున్నారు. కార్యక్రమంలో అయ్యన్న, సుభాష్, జనార్దన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, శ్రీను, అంజన్న, శాంత న్న, లక్ష్మీనారాయణ, నాగరాజు, రాములు, ఇజ్రాయేలు, రామన్‌గౌడ్, కొండన్న, గోవర్దన్, రాజు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...