రెండు కార్లు ఢీ..ఐదు మందికి గాయాలు


Wed,April 17, 2019 02:13 AM

మూసాపేట: ముందు వెళ్తున్న కారును మరో కారు ఢీ కొట్టిన సన్నివేశం చూపర్లుకు యాక్షన్ సినిమాలోని సన్నివేశాలను తలపించింది. స్థానికులు, బాధితుల వివరాల ప్రకారం.. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని చిత్తురుకు చెందిన న్యాయవాధి కిషోర్‌కుమార్ హైదరాబాద్‌లో సోమాజిగుడలో స్థిరడ్డారు. అయితే ఆయన కుటుంబ సభ్యులతో పాటు కలిసి కడప నుంచి హైదరాబాద్‌కు బయలు దేరారు. మార్గ మధ్యలోని వనపర్తి జిల్లా కనిమెట్ట దగ్గర ఉన్న పుడ్‌ప్లాజా వద్ద సేదతీరి మంగళవారం తెల్లవారుజామున బయలు దేరారు. మార్గ మధ్లలో మూసాపేట జాతీయ రహదారిపైకి రాగాను వెనక వూపు నుంచి వస్తున్న మరో కారు వచ్చి ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టింది. దీంతో ఆ కారు గాలిలో ఎగిరిపోయి విభా విత్తనాల తయారి పరిశ్రమకు ఏర్పటు చేసిన ఇనుప కంచెక్కు వెళ్లి ఢీ కోట్టింది. దీంతో కారులో ఉన్న కిషోర్ కుమార్‌కు కాలుకు గాయం కావడంతో పాటు, భార్య సింధుకు ముఖఃపై బలమైన గాయమై తీవ్రంగా రక్త శ్రావం అయ్యింది. అదేవిధంగా అజయ్ చేతికి, యశశ్వినికి తలకు బలమైన గాయాలు అయ్యియి. సంఘటన స్థలానికి ఎస్సై మధుసుదన్‌గౌడ్ చేరుకొని క్షతగాత్రులను ఎల్‌అండ్‌టీ అంబులేన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...