మహిళా సంఘాలకు.. మెప్మా ఆసరా!


Tue,April 16, 2019 02:50 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : ఒకప్పుడు ఏదైనా అవసరం ఉంటే, వారి జీవనోపాధికి విధిగా డబ్బులను అప్పులు చేసుకుంటూ వారి అవసరాలను తీర్చుకునేవారు. పట్టణంలో పేదరికంలో ఉండే మహిళలను పట్టణ పేదరిక నిర్మూళన సంస్థ (మెప్మా) మున్సిపల్ శాఖ ఆసరాగా నిలుస్తుంది. మహిళా సంఘంలో ఉండే సభ్యులకు అవసరమైన సమయంలో తక్కువ వడ్డీతో రుణాలను అందజేయడంతో పాటు పొదుపు చేసుకునే అవకాశం కల్పించడంతో మహిళలు వారి అవసరాలను అప్పులను చేయకుండా ఆ రుణాల ద్వారా తమ జీవనోపాధులను తీర్చుకుంటున్నారు. వడ్డీలు కట్టలేని వారికి ఆసరాగా మహిళా సంఘాలు ఎంతో గానో ఉపయోగపడుతున్నాయి. ఒక్కో సంఘం తీసుకున్న రుణాలను 3 నుంచి 5 సంవత్సరాలలోపు రుణాలను చెల్లించి తిరిగి కొత్త రుణాలను తీసుకుంటారు. మహిళా సంఘాలకు అందించే రుణాలతో పాటు అదనంగా 2019 సంవత్సరంలో 809 సంఘాలకు రూ.76లక్షల 35వేల 451 వడ్డీలేని రుణాలను అధికారులు మహిళా సంఘం సభ్యులకు అందజేశారు. మున్సిపాలిటీ శాఖలో కమిషనర్ మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ, మెప్మా సిబ్బంది సకాలంలో మహిళా సంఘాలకు కావాల్సిన రుణాలను అందజేయడంలో వనపర్తి మెప్మా మున్సిపాలిటీ శాఖ పాత 69 మున్సిపాలిటీలో రాష్ట్రంలో ముందు వరుసలో ఉంది.

పట్టణంలో 930 మహిళా సంఘాలు..
పట్టణ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 930 మహిళా సంఘాలు, ఆర్పీలు 40 మంది ఉన్నారు. ఒక్కో మహిళా సంఘం గ్రూప్‌లో 10 నుంచి 15 మంది సభ్యులు గుర్తించడం జరుగుతుంది. 930 మహిళా సంఘాలకు గాను 9707 మంది మహిళలు సభ్యులుగా ఉంటూ వారి జీవనోపాధిని జరుపుకుంటున్నారు. ప్రతి నెల 10వ తేదీన ఆయా గ్రూప్ సభ్యుల లీడర్ వారి సభ్యులతో సమావేశం నిర్వహించుకుని రుణాలను తీసుకున్న వారి వద్ద నుంచి బ్యాంకులకు చెల్లించాల్సిన డబ్బులను తీసుకుని తిరిగి బ్యాంకులలో జమ చేసుకుంటారు.

ప్రతి నెలా ఆర్పీలతో మీటింగ్..
పట్టణ మెప్మా మున్సిపాలిటీ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాలతో ఇన్‌చార్జి జిల్లా మిషన్ కోఆర్డినేటర్(డీఎంసీ), మెప్మా అధికారుల ఆధ్వర్యంలో ప్రతి నెల ఆర్పీలకు సమావేశంను జిల్లా కేంద్రంలోని దామోదర్‌తోటలో లేదా మున్సిపాలిటీ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రతి నెల 7వ తేదీన సమావేశాన్ని నిర్వహించుకుంటున్నారు. ఈ సమావేశంలో రుణాలను రాని సంఘాలను గుర్తించి వారికి రుణాలు వచ్చే విధంగా కృషి చేయడంతో పాటు, సక్రమంగా రుణాలను చెల్లించని వారిపై ప్రత్యేక శ్రద్ధ వంటి సూచనలు, సలహాలను ఇస్తుంటారు. పేదరికంలో ఉండి మహిళా సంఘంలో లేని మహిళలను గుర్తించి పది మంది సభ్యులు కాగానే వారిచే 7 నెలల వరకు ఆయా బ్యాంకులలో మహిళా సంఘం పేరిట పొదుపు చేయించి మొదటి విడతగా రూ.7వేల నుంచి లక్ష రూపాయలకు రుణాలను అందజేస్తూ మహిళా సంఘాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ప్రభుత్వం నుంచి అమలు చేస్తున్న పథకాల గురించి మహిళా సంఘాల సభ్యులకు తెలియజేస్తూ వారు లబ్ధిపొందేలా ఆర్పీలకు సమావేశంలో అధికారులు తెలియజేస్తున్నారు.

మహిళా సంఘాలు చేయవలసిన నియమాలు..
మహిళా సంఘాలు రుణాలను సకాలంలో అందుకోవాలంటే కొన్ని నియమాలను విధిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
- మహిళా సంఘం బుక్ కీపింగ్‌ను క్రమం తప్పకుండా రాయాలి
- సమావేశాలను ఆయా మహిళా సంఘం సభ్యులతో గ్రూప్ లీడర్ నిర్వహించుకుని అందుకు సంబంధించిన అంశాలను సంఘం పుస్తకంలో పొందుపరచాలి
- ప్రతి నెల పొదుపు తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాలి
- బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను సకాంలలో సంఘం సభ్యులు చెల్లించాలి

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...