ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధంకండి


Tue,April 16, 2019 02:48 AM

వనపర్తి రూరల్ : మండలంలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఎన్నికల అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని ఎంపీడీవో అఫ్జలొద్దీన్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో 2019 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పీవో, ఏపీలకు అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ పట్ల అధికారులు వ్యవహరించాల్సిన పద్ధతులను, గత ఎన్నికలలో ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించిన మాదిరిగా కాకుం డా సర్పంచ్ ఎన్నికలలో మాదిరిగానే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం, బూత్‌లలో ఏర్పాటు చేయాల్సి ఏర్పాట్లపై, తదితర విషయాలను అధికారులకు అవగాహన కల్పించారు. ఈ శిక్షణలో మొత్తం పీవోలు 284 మంది, ఏపీవోలు 199లకు పాల్గొన్నారని తెలిపారు. వీరికి మాస్టర్ ట్రైనింగులుగా నాగరాజు, జితేందర్, కురుమూర్తి, చంద్రమోహన్‌లు వ్యవహరించారని తెలిపారు. కార్యక్రమంలో ఏపీవో అధికారి నరేందర్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

ఖిల్లాఘణపురంలో..
ఖిల్లాఘణపురం : మే నెలలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలకు సిద్ధంకావాలని ఎన్నికల అధికారులు సుదర్శన్, చిరంజీవి పీవో, ఏపీవోలకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో మొత్తం 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయని అందులో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలను కేటాయించడం జరిగిందన్నారు. అం దులో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎస్టీ జనరల్ కేటాయించగా ఎంపీటీసీ స్థానాలకు ఖిల్లాఘణపురం(1)-బీసీ మహిళ, ఖిల్లాఘణపురం(2)-ఎస్సీ మహిళ, మామిడిమాడ, పర్వతాపూర్- ఓసీ మహిళ, సల్కలాపూర్, అప్పారెడ్డిపల్లి-బీసీ జనరల్, తిరుమలాయపల్లి, అల్లామాయిపల్లి, రోడ్డుమీదితండా, ఈర్లతండా, మల్కినియాన్‌పల్లి-ఎస్సీ జనరల్, కమాలుద్దీన్‌పూర్, అంకాయపల్లి, ఆగారం-మహిళ జనరల్, వెంకటాంపల్లి, మల్కాపూర్, గట్టుకాడిపల్లి-ఓసీ జనరల్, మానాజీపేట-ఓసీ జనరల్, సోలీపూర్, కోతులకుంట తండా -ఓసీ జనరల్, షాపూర్, దొంటికుంట తండా, రుక్కన్పపల్లి -ఎస్టీ మహిళ, ఉప్పర్‌పల్లి, సూరాయపల్లి-ఓసీ జనరల్, వెనకితండా, కర్నెతండా, అముదంబండతండా-ఎస్టీ జనరల్ రిజర్వేషన్లను కేటాయించినట్లు చెప్పారు. ఈ స్థానాలలో ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో మం డ ల ఎన్నికల అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పాల్గొన్నారు.

గోపాల్‌పేటలో..
గోపాల్‌పేట : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సిబ్బందికి సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భ ంగా ఎంపీడీవో బాలాజీ పీవోలు, ఏపీలకు ఎన్నికల నిర్వహణపై వివరించారు. గోపాల్‌పేట, రేవల్లి మండలాలకు చెందిన ఎన్నికల సిబ్బంది శిక్షణా తరగతులకు హాజరైనట్లు ఎంపీడీవో తెలిపారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...