ఖైదీలకు వైద్యసేవలు


Tue,April 16, 2019 02:48 AM

మహబూబ్‌నగర్ క్రైం : ప్రభుత్వ జనరల్ దవాఖాన వైద్యులు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్ ఆధ్వర్యంలో జిల్లా జైలులో ఉన్న ఖైదీలకు వైద్యసేవలు అందించి మందులు అందజేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌లో గల మహబూబ్‌నగర్ జిల్లా జైలులో జనరల్ దవాఖాన ఆధ్వర్యంలో జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్, దవాఖాన సూపరింటెండెంట్ డా. రాంకిషన్ మెగాహెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్‌లో 130 మంది మగ ఖైదీలను, 30 మంది మహిళ ఖైదీలకు వైద్యసేవలు అందించారు. రక్తహీనత, మధుమేహం, చర్మవ్యాధి సంబంధించిన వైద్య పరీక్షలను నిర్వహించారు. అలాగే మద్యానికి బానిసైన వారిని, మద్యానికి బానిసై వదిలేయడం ద్వారా ప్రభావం చెందినవారికి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా దవాఖాన సూపరింటెండెంట్ డా.రాంకిషన్ మాట్లాడారు. మానసిక రుగ్మత, మానసిక సంఘర్షణనకు లోనైన వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఖైదీలకు మానసిక పరివర్తనలో మార్పునకు కావాల్సిన సూచనలు చేశారు. కార్యక్రమంలో జనరల్ మెడిసిన్ విభాగం నుంచి హెచ్‌వోడీ డా. నిశాంత్, డా. అమరావతి, డాక్టర్లు ప్రవీణ, మీర్జా, సాయినాథ్, సుష్మిత, డెర్మాటలజి డా. అరుణ, డా. రామాకాంత్‌లు ఖైదీలకు వైద్యసేవలు అందించారు.

శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
మక్తల్, నమస్తే తెలంగాణ : ఏకలవ్య స్పోర్ట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత క్రీడ శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మక్తల్ సీఐ వెంకట్ అన్నారు. సోమవారం మక్తల్ మీనిస్టేడియం గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ఉచిత వేసవి క్రీడ శిక్షణ శిబిరానికి సీఐ వెంకట్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచ యం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవి సెలవులను వృథా చేయకుండా క్రీడల్లో పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. క్రీడమెల్కొవలు నేర్చుకొని క్రీడల్లో రాణించి రాష్ట్రస్థాయిలోకి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. క్రీడల వలన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సీఐ వెంకట్ శిబిరాన్ని నిర్వహిస్తున్న ఏకలవ్య స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గోపాలంను అభినందించారు. అనంతరం క్లబ్ అధ్యక్షుడు గోపాలం మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు బాల బాలికలకు క్రీడల్లో మెరుగైన శిక్షణను ఇచ్చి క్రీడ పాఠశాలకు, క్రీడ ఆకాడమిలకు, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడలకు పంపడం జరుగుతుందన్నారు. పీఈటీ ట్రైనింగ్ కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ శిబిరంలో మొదటి రోజు 80 మంది బాల బాలికలు పాల్గొన్నారన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ప్రశంసా పత్రాలను, క్రీడా దుస్తులను అందజేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ప్రవీణ్, పీఈటీలు కుమార్, అంబ్రేష్, రూప, ఇబ్రహీం, రాకేశ్, శేషగిరి, బాలబాలికలు తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...