దిశానిర్దేశం చేసిన మహనీయుడు


Mon,April 15, 2019 02:38 AM

వనపర్తి విద్యావిభాగం/కలెక్టరేట్ : రా జ్యాంగాన్ని రచించి దేశానికి దిశా నిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని జి ల్లా రెవెన్యూ అధికారిణి పద్మజారాణి అ న్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని త రుణి ఫంక్షన్‌హాల్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా అంబేద్కర్ 128వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ రాజ్యాంగం ద్వారానే రాష్ట్రం సిద్ధించిందని గుర్తుచేశారు. ప్రపంచంలో అనేక అం శాల్లో కారల్‌మార్క్స్, జోసఫ్ మార్టిన్‌లతో పా టు అంబేద్కర్ ఒకరని అన్నారు. ఆ మహనీయుని అడుగుజాడల్లో నేటి సమాజం, యువ త ముందుకుసాగాలన్నారు. అనంతరం డీఎస్పీ సృజన మాట్లాడుతూ మహోన్నత వ్యక్తుల వ్య క్తిత్వం, జీవిత చరిత్రను లోతైన అధ్యయనం ద్వారానే వెలుగులోకి వస్తుందని, తద్వారా యువత సన్మార్గంలో పయనించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. 13 భాషల్లో ని ష్ణాతులని, 51 విభాగాల్లో పీహెచ్‌డీ పూర్తి చేశారని, అలాంటి మహోన్నత వ్యక్తుల మనోభావాలకు కులాన్ని అంటకట్టకూడదని సూచించారు. మహనీయులు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయులని గుర్తుచేశారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమోంటోలను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో పీడీ గణేష్, స్పెషల్ కలెక్టర్ వెంకటయ్య, జియలజిస్ట్ యుగంధర్, ఎస్పీ కార్పొరేషన్ అధికారి వెంకటస్వామి, డీపీవో రాజేశ్వరి, మున్సిపల్ క మిషనర్ రజినీకాంత్‌రెడ్డి, ఎస్సీ జిల్లా స్థాయి క మిటీ కన్వీనర్ మధుకర్, కిరణ్‌కుమార్, యో సేపు, బైరోజ్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...