అంతా రామమయం


Mon,April 15, 2019 02:37 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని పలు ఆలయాల్లో ఆదివారం సీతారాముల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగింది. ఆలయ అర్చకులు వేద మంత్రాల సాక్షిగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రామాలయం, వేంకటేశ్వరస్వామి, బాలనగర్ కాలనీలోని బాలాంజనేయ స్వామి, పాండురంగ స్వామి, హనుమాన్ టేకిడిలోని హనుమాన్, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాలను కల్యాణ వేడుకలకు ఒక రోజు ముందుగానే సిద్ధం చేశారు. వేడుకల్లో భాగంగా ఆయా ఆలయాల ఆవరణలో ముత్యాల పందిరిని వేశారు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి విగ్రహాలను పందిరిలోకి అర్చకులు ఊరేగింపుగా తీసుకువచ్చారు. రామాలయంలో జరిగిన కల్యాణానికి ముత్యాల తలంబ్రాలను వాయిద్యాల మధ్యలో రమేష్‌చంద్ర, కౌన్సిలర్ వాకిటి శ్రీధర్‌లు సమర్పించగా, వాటిని మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్, ఆవుల రమేష్‌లు కల్యాణ మహోత్సవానికి తీసుకువచ్చి సమర్పించారు. ముందుగా అర్చకులు స్వామి, అమ్మవారికి హారతి ఇచ్చి వేద మంత్రాలతో పూజలు చేసి జిలకర బెల్లం ధారణ, మాంగల్య ధారణతో మధ్యాహ్నం 12:15 గంటలకు సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ముత్యాల తలంబ్రాలు, నవరత్నాల తలంబ్రాలను కౌన్సిలర్ వాకిటి శ్రీధర్ సీతారాములకు చటారిపై సమర్పించారు. కల్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...