సగర సంక్షేమానికి అండగా ఉంటాం


Mon,April 15, 2019 02:37 AM

కొత్తకోట : సగర సంక్షేమాభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన సగరుల ఆరాధ్య దైవమైన భగీరథ మహర్షి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని, సగరుల సంక్షేమానికి కూడా కట్టుబడి ఉం దన్నారు. సగరులతో పాటు అందరూ భగీరథ మహర్షి ని ఆదర్శ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రోజు భగీరథ మహర్షిని సగరులు ఆరాధ్యదైవంగా పూజించడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరికి శుద్ధజలాన్ని అందించడంలో భాగంగా ఆ పథకానికి మిషన్ భగీరథ నామకరణం చేయడం జరిగిందన్నారు. సగరులు కమ్యునిటీ హాల్ కోసం నిధులు మంజూరు చేయాలని, అలాగే హైమాస్ట్ లైట్ ఏర్పాటుకు కృషి చేయాలని సగరులు కోరడంతో సానుకూలంగా స్పంది ంచిన నిధులు మంజూరు చేయుటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సగర సంక్షేమానికి అండగా ఉంటానని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ పి.జె. బాబు, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు వామన్‌గౌడ్, ప్రధాన కార్యదర్శులు మిషేక్, బాలకృష్ణ, రాములుయాదవ్, బాలనారాయణ, ప్రశాంత్, బీంరెడ్డి, జగన్, శ్రీనూజీ, సత్యంయాదవ్, హనుమంతుయాదవ్, బో యేజ్, ప్రశాంత్, అయ్యన్న, ఏసు, సగర సగరులు బుచ్చన్న, వినోద్, రాములు, కృష్ణయ్యలు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...