పరిషత్ పోరుకు పచ్చజెండా


Mon,April 15, 2019 02:37 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : గ్రామా ల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో వే గం పెరుగుతుంది. ఈ ఎన్నికలపై ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పచ్చజెండా ఊపడంతో ఇప్పుడిప్పుడే ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం రంగంలోకి ది గింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో ఎన్నిక లు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన క్రమంలో జిల్లాలోని 14 మండలాల్లో ఎన్నికలు జరిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందడి మొదలైంది. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం నాయకులు, ఓటర్ల దృష్టంతా స్థానిక పోరుపైకి మళ్లింది. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల పర్వం ముగియడంతో ఇక కేవలం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ మాత్రమే మిగిలిం ది. ఈ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల సుముఖత వ్యక్తం చేసిన క్రమంలో ఏర్పాట్లను చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో మొత్తం 128 ఎంపీటీసీ స్థానాలు, 14 జెడ్పీటీసీ స్థానాలకుగాను ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 22 నుంచి నోటిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించి మే 14 వరకు పోలింగ్‌ను పూర్తి చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘం పరిషత్ ఎన్నికలపై కసరత్తును వేగం చేసింది.

రిజర్వేషన్ల వారీగా అంచనాలు..
రిజర్వేషన్ల వారీగా గ్రామాల్లో పరిషత్ పోరుకు అంచనాలు వేసుకుంటున్నారు. గత నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యా యి. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే పల్లెల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోరుకు కార్యాచరణ మొదలైంది. గ్రామాలకు వచ్చిన రిజర్వేషన్లు.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అవకాశాలు అందని వారు వీటిపైనే దృష్టి పెట్టారు. ఇప్పటికే వారి అనుచరులతో మంతనాలు షురు చేశారు. ఏ అవకాశం వచ్చిన చేజార్చు కోకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మండ ల స్థాయిలో కీలకంగా ఉండే ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులను దృష్టిలో ఉంచుకుని నాయకులు పావు లు కదుపుతున్నారు. ఇదిలా ఉంటే, అధికారులు సహితం పరిషత్ పోరుకు అవసరమైన ఏర్పాట్లను చేయడంపై దృష్టి పెట్టారు. అయితే, వార్డుల వారీగా ఓటర్లను విభజించిన అధికారులు ఆయా ఎంపీటీసీ స్థానాల వారీగాను కేటాయించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో తుది ఓటరు జాబితాలను ప్రచురించారు. ఎన్నికల నిర్వహణలో మిగిలిన అంశాలపై దృష్టి సారించారు.

వేగంగా ఏర్పాట్లు..
జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లను అధికారులు వేగంగా చేస్తున్నారు. మండలాల్లో ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. తుది ఓటరు జాబితా ప్రచురించిన అధికారులు మిగిలిన పనులు పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం గ్రామాలను సందర్శించి అవసరమైన ఏర్పాట్లకు గుర్తిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఎన్నికలు గతంలో మాదిరిగానే బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహిస్తున్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, ఎన్నికల సిబ్బంది జాబితా రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం పరిషత్ ఎన్నికలపై ఓ అవగాహనకు రావడంతో దాదాపు పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకునే పనిలో అధికారయంత్రంగం నిమగ్నమైంది.

జిల్లాలో 3.42 లక్షల ఓటర్లు
జిల్లాలోని 14 మండలాల్లో 3,42,450 మంది ఓటర్లున్నారు. అలాగే 14 జెడ్పీటీసీలు, 128 ఎంపీటీసీ స్థానాల ద్వారా ఓటర్లు నూతన ప్రజా ప్రతినిధులను ఎన్నుకోబోతున్నారు. జిల్లాలు, మండలాల పునర్విభజన అనంతరం వస్తున్న ఈ పరిషత్ ఎన్నికల ద్వారా నూతన మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు ఏర్పాటు అవుతుండటం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే, పరిషత్ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన క్రమంలో ఇక్కడి పరిస్థితులను బట్టి రెండు విడతల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, మండల కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించడంతో పాటు మూడు ఎంపీటీసీ స్థానాలకు ఒక కేంద్రంగా పరిగణించి నామినేషన్లు వేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...