అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం


Mon,April 15, 2019 02:37 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ /విద్యావిభాగం/ గోపాల్‌పేట/రేవల్లి/ఖిల్లాఘణపురం/పెద్దమందడి /పెబ్బేరు టౌన్/రూరల్ : భారత రాజ్యాంగ రూపకర్త డా.బీ.ఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని, ఆయన ఆశయాలను కొనసాగిద్దామని మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టుయాదవ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ రజినీకాంత్ రెడ్డి, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి, జిల్లా దవాఖానలోని రక్తనిధి కేంద్రం వద్ద ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, జిల్లా దవాఖాన వైద్యుడు అజీజ్‌ఖాన్, పట్టణాధ్యక్షుడు గట్టుయాదవ్‌లు వేర్వేరుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లును అర్పించారు. అలాగే జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా మాల ఐక్య సంఘం, యూటీఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. వనపర్తి డిపోలో డీఎం దేవదానం ఆధ్వర్యంలో, యూటీఎఫ్, డీటీఎఫ్, టీపీఆర్‌టీయూ, తపస్ సంఘం ఆధ్వర్యంలో వేర్వేరుగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోపాల్‌పేట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.

అలాగే రేవల్లి మండలంలోని ఆయా గ్రామాలల్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మణ్‌రావు, పాతతండాలో సర్పంచ్ గౌడనాయక్, చెన్నారంలో సర్పంచ్ ఎంపీటీసీలు రమేష్, స్వామిరెడ్డి, శానాయిపల్లిలో సర్పంచ్ లక్ష్మి, బండరాయిపాకులలో దళితనాయకులు మహేష్, శ్రీరాములు, కిరణ్‌ల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఖిల్లాఘణపురం మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. పెబ్బేరు మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఆదివారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని అంబేద్కర్ కాలనీవాసులు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం అంబేద్కర్ నగర్ నుంచి స్థానిక కొల్లాపూర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు శోభాయాత్ర నిర్వహించారు.

పెద్దమందడి మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కృష్ణ, కౌన్సిలర్లు వాకిటి శ్రీధర్, తిరుమల్, కమలమ్మ, రమేష్‌నాయక్, రమేష్, భువనేశ్వరి, పార్వతమ్మ, ఇందిరమ్మ, కృష్ణయ్య, నాయకులు లక్ష్మీనారాయణ, జహంగీర్, శ్యాం, కృష్ణ, రహీం, గులాం ఖాదర్, గిరి, రాజు, పరంజ్యోతి, డానియల్, మహేష్, కృష్ణ, మురళీసాగర్, సుభాష్, రాము, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఖాజా ఖుతుబొద్దీన్, స్వేరోస్ సభ్యులు చిరంజీవి, లక్ష్మీపతి, వాహీద్, మహ్మద్‌పాష, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ప్రసాద్, పట్టణాధ్యక్షుడు కిరణ్‌కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు మూడావత్ శంకర్, బాల్‌రెడ్డి, పద్మ, వసంత, శేషిరెడ్డి, శ్రీనివాసులు, లక్ష్మి, భాగ్యలక్ష్మీ, శేఖర్ యాదవ్, శంకర్ నాయక్, రజని, పద్మ, శ్రీలత, నాగమణి, రేవల్లి పంచాయతీ కార్యదర్శి శిల్ప, మల్లమ్మ, బిచ్చమ్మ, ఆశన్న, రవీందర్‌రెడ్డి, మల్లమ్మ, బిచ్చన్న, చిన్నరాములు, సాయినాథ్, రాము, మద్దిలేటి, నారమ్మ, లక్ష్మి, సూర్య, సర్పంచ్ వెంకటరమణ, ఉప సర్పంచ్ యాదయ్య, నాయకులు, విక్రం, కృష్ణాయ్య, భుమయ్య, యదగిరి, మధు, చెన్నయ్య, లింగస్వామి, పెబ్బేరు ఎంపీపీ పద్మావతి, ఎస్‌ఐ విజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, మాజీ జెడ్పీటీసీ కర్రెస్వామి, ఎంపీటీసీ ఐజాక్, పెద్దమందడి ఎంపీపీ దయాకర్, ఈవోఆర్డీ భానుప్రసాద్, వీఆర్‌వో వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షురాలు జయంతి పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...