ఊరు వాడ కల్యాణోత్సవం


Mon,April 15, 2019 02:36 AM

మహబూబ్‌నగర్, తెలంగాణ చౌరస్తా : మహబూబ్‌నగర్ మండలంలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి మన్యంకొండ దేవాలయంలో సీతారాముల కల్యాణం ఆదివారం వైభవంగా దేవాలయ చైర్మన్ మధుసూధన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కల్యాణానికి జిల్లాలోని అన్ని మండలాల నుంచి స్వామి వారి కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి కల్యాణాన్ని కనులారా చూసి తరించారు. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమికి కల్యాణోత్సవం ప్రత్యేకంగా దేవాలయ పాలక మండలి సభ్యులు, దేవాలయ అర్చకులు నిర్వహిస్తారు. కల్యాణంలో పాలు పంచుకొని పెళ్లీలు కాని వాళ్లకు త్వరగా పెళ్లీలు అవుతాయని నమ్మకంతో స్వామి వారికి మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు స్వామి వారికి తమ కానుకలను పట్టువస్ర్తాల ద్వారా, ముత్యాల తలంబ్రాల ద్వారా సమర్పిస్తారని దేవాలయ ధర్మకర్త మధుసూదన్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటాచారి, ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు, శ్రీనివాస్‌రెడ్డి, బీచుపల్లి, పాలక మండలి సభ్యులు అపర్ణారెడ్డి, మంజుల, మహాలక్ష్మీ, చంద్రమౌళి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

కోయిలకొండలో..
కోయిలకొండ : జిల్లాలో ప్రసిద్ది చెందిన శ్రీరామకొండ దేవాయలంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా కొండపై ఉన్న సీతారాముల మూల విగ్రహాలకు ప్రత్యేక అభిషేకం, అలంకరణ పూజలను జరిపించారు. అనంతరం సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి పట్టువస్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆర్‌ఐ ఆరుణ, వీఆర్‌వో రమేష్ సమర్పించారు. ఎండ తీవ్రతున్న భక్తులు కొండపైకి చెరుకొని స్వామి వారి కల్యాణ ఉత్సవంలో పాల్గొన్నారు. సీతారాముల కల్యాణ ఉత్సవాలో భాగంగా దేవాలయంలో అఖండ హరి సంకీర్తన కార్యాక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన లక్ష్మీనారాయణ భక్తుడు బియ్యం గింజపై 516 శ్రీరామ నామాన్ని వ్రాసి తలంబ్రాలకు సమర్పించారు. రామనవమి సందర్భంగా శ్రీరామకొండకు వచ్చిన భక్తులకు తాగునీరు, అన్నదాన కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశా రు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, ఎంపీటీసీ యాదవ్‌కుమార్ దేవాలయ కమిటీ సభ్యు లు వెంకట్రాములు, వెంకట్‌నాయక్, రాధకృష్ణ, వెంకట్, రాములు తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...