ప్రజలంతా సమానంగా జీవించాలి


Mon,April 15, 2019 02:35 AM

- జిల్లా సీనియర్ సివిల్ జడ్జి రవికుమార్
వనపర్తి రూరల్ : ప్రపంచ దేశాలలో ఏ దేశంలో లేని రాజ్యాంగ చట్టాన్ని మన దేశ మేదావులు రూ పొందించి దేశంలోని అన్ని వర్గల ప్రజలు సమాన్వతంగా జీవించేలా మన రాజ్యాంగాన్ని రూపొందించారని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి రవికుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని చిట్యాల గ్రామంలో డా.బీ.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కారించుకొని ఏర్పాటు చేసి పౌరువుల ప్రాథమిక హక్కులపై అవగామన సదస్సుకు ఆయన హాజరై గ్రామంలోని అంబేద్కర్ విగ్రహాన్నికి పూలమాలు వేసి ఘనంగా నివాళ్లుర్పించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో ప్ర తి పౌరుడికి ప్రభుత్వాలు కల్పించాల్సిన ప్రాథమిక హక్కులను, వాటిని సద్వినియోగం పర్చుకొవాల్సిన బాధ్యత కూడ పౌరులకు ఉందాని తెలిపారు.

దేశంలో వస్తు మార్పులకు అనుగుణంగా ప్రజల లో కూడా మార్పులు రావాలని, చైతన్య వంతులు కావాలని సూచించారు. అంతకుముందు ఏజీపీ శశిభూషణ్, సీఐ సూర్యనాయక్, సర్పంచ్ భానుప్రకాష్‌లు మాట్లాడుతూ ప్రజల ఎవరితోనైన అవసరాల కోసం డబ్బులు తీసుకున్న సందర్భంలో తెల్ల కాగితం, బ్లాంక్ చెక్‌లపై సంతకాలను చేయవద్దని, మీరు ఎంతడబ్బులు తీసుకున్నారో అంతకే వాటిలో పూర్తి సమాచారం ఉండేలా చూసుకొవాలని పలు సూచనలు తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమ నిర్వహించారు. అలాగే కడుకుంట్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్నికి గ్రామంలోని దళిత శక్తి ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళ్లుర్పించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై రాఘవేందర్ రెడ్డి, మాజీ జెడ్ప్‌టీసీ వెంకట్రావ్, న్యాయవాదులు శ్రీనివాసు చారి, ఉత్తరయ్య, తూర్పు, పడమటి తండా గ్రామ సర్పంచులు గోపాల్‌నాయక్, పుల్లజీన్ నాయక్, వైస్ ఎంపీటీసీ సురేష్ నాయక్, అంబేద్కర్ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...