ప్రతి ఒక్కరూ పోలీస్ కావాలి


Sun,April 14, 2019 02:59 AM

వనపర్తి విద్యావిభాగం : విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ప్రతి ఒక్కరూ తెలంగాణ పోలీస్ కావాలని ఎస్పీ అపూర్వరావు అన్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు జిల్లా కేంద్రంలోని దాచలక్ష్మయ్య ఫంక్షన్ హాల్‌లో శనివారం కరెంట్ ఎఫైర్స్‌పై రెండు రోజుల పాటు ఇవ్వనున్న ఉచిత శిక్షణ కార్యక్రమానికి ఎస్పీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 20 రోజులు చాలా ముఖ్యమైనవని, సరైన పద్ధతిలో చదువుకుని విజయాలు సాధించాలన్నారు. 20 రోజుల కష్టపడితే 20 నుంచి 30 ఏండ్లు హాయిగా బతకవచ్చన్నారు. వేసవి తాకిడి, ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పేద నిరుద్యోగిని ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మార్చాలనే సంకల్పంతో చేస్తున్న మా చిరు ప్రయత్నమని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలోనే కరెంట్ ఎఫైర్స్‌లో నిపుణులైన బోధకుడు మట్టపల్లి రాఘవేందర్‌చే శిక్షణ అందిస్తున్నామని, ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డీఎస్పీ సృజన మాట్లాడుతూ భయాన్ని వీడి విద్యార్థులు పోటీ పరీక్షలో సత్తా చాటాలన్నారు. చేసే పనిమీదనే శ్రద్ధ ఉండాలన్నారు. ఎక్కువ పోటీతత్వం ఉన్నప్పుడే అందు లో రాణించి ఉద్యోగం పొందితే అందులో వచ్చే అనుభూతి గొప్పదన్నారు. శిక్షణకు మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల తదితర జిల్లాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో సీఐ సూర్యనాయక్, ఎస్‌ఐ నరేందర్, శిక్షణ నిర్వహకులు రాజాగౌడ్, పాష ఉన్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...