నేటి నుంచి శ్రీరామనవమి బ్రహోత్సవాలు


Sun,April 14, 2019 02:47 AM

గోపాల్‌పేట : మండల కేంద్రంలోని కోదండరామస్వామి ఆలయంలో ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు కోదండరామస్వామి జాతర బ్రహోత్సవాలు జరుగనున్నా యి. శనివారం ఉదయం 10 గంటల నుంచి అంకురార్పణం, ధ్వజారోహణం, రాత్రికి దేవాతాహ్వానం, ప్రత్యేక పూజలు జరుగును. 14న ఉదయం 7 నుంచి 9గంటల వరకు హోమం, బలిహరణం 10 గంటల నుంచి స్వామి వారి కల్యాణోత్సవం సాయ ంత్రం 6గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిత్య నైమిత్తికం, హోమం, బలిహరణం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 15, 16, 17న ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...