పట్టుబట్టి కొలువు కొట్టి


Sun,April 14, 2019 02:45 AM

మహబూబ్ నగర్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 9335 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం కోసం ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 30వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ కారణాలతో ఈ నియామకాలు ఆలస్యం అయ్యాయి. ఈ పోస్టుల భర్తీకి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవడంతో గురువారం రాత్రి అర్హులైన వారికి అధికారులు నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసిన తర్వాత సరిపడ మేర కార్యదర్శులు లేక పాలనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టింది. అయితే పలు కారణాలతో ఉద్యోగ నియామకాలకు కాస్త ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు ఉద్యోగాల భర్తీ చేయడంతో సర్కారీ కొలువులు సాధించామనే సంతోషం యువతలో కనిపిస్తోంది. మరోవైపు తమ గ్రామాలకు పంచాయతీ కార్యదర్శులు రావడం వల్ల సమస్యలు తీరుతాయని పల్లె ప్రజలూ భావిస్తున్నారు.

నారాయణపేట జిల్లా ఏర్పడక ముందు కొత్తగా ఏర్పడిన 265 పంచాయతీలతో కలిపి మహబూబ్‌నగర్ జిల్లాలో 721 గ్రామ పంచాయతీలుండేవి. అయితే కేవలం 205 మంది పంచాయతీ కార్యదర్శులు మాత్రమే ఉండేవారు. దీంతో ఒక్కో కార్యదర్శికి 3 నుంచి 4 గ్రామాల వరకు విధులు నిర్వర్తించాల్సి వచ్చేది. దీంతో కొత్తగా పంచాయతీలుగా ఏర్పడిన తండాలు, చిన్న చిన్న గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ఇబ్బందులు తప్పే పరిస్థితి కనిపించలేదు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 9335 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామక పరీక్ష పూర్తయినా.. వివిధ కారణాలతో నియామకాలు మాత్రం ఆలస్యమవుతూ వచ్చా యి. చివరికి గురువారం కొత్త పంచాయతీ కార్యదర్శులకు మహబూబ్‌నగర్‌లోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా ఉద్యోగాలు సాధించిన వారికి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారంతా యువతే. కాబట్టి గ్రామాభివృద్ధి వీరంతా ఉత్సాహంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కొత్తగా కొలువులు సాధించిన వారు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పల్లెపాలన మరింత బాగా సాగేందుకు ఈ నియామకాలు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది.

జోగుళాంబ గద్వాల జిల్లాలో..
గద్వాల, నమస్తేతెలంగాణ : పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కావడం జూనియర్ కార్యదర్శులుగా ఎంపికైనా వారికి జిల్లా పంచాయతీ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ చేతుల మీదుగా 150 మందికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. కొత్త కార్యదర్శులకు గ్రామాలు కేటాయించడంతో ఎంపికైనా ఉద్యోగులు కోటిఆశలతో కొత్తకొలువులోకి శుక్రవారం నుంచి అడుగుపెట్టారు. జిల్లాలో నూతనంగా ఏర్పడిన పంచాయతీలతో కలుపుకుని మొత్తం 255 పంచాయతీలు ఉండగా కార్యదర్శులు మాత్రం 94మంది మాత్రమే ఉండేవారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 161 పోస్టుల భర్తీ కోసం గతేడాది అక్టోబర్ పదో తేదీన రాత పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా డిసెంబర్ నెలలో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అభ్యర్థుల ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించారు. అయితే ధ్రువపత్రాల పరిశీలనకు కేవలం 150 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నాలుగు నెలల తర్వాత ఎంపికైనా అభ్యర్థులకు అధికారులు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు.

వనపరి జిల్లాలో..
వనపర్తి రూరల్ : వనపర్తి జిల్లా వ్యాప్తంగా 159 గ్రామ కార్యదర్శుల పోస్టులకు టీఎస్‌పీఎస్సీ ద్వారా నిర్వహించిన రాత పరీక్షలో ఎంపికైన వారికి జిల్లా పంచాయతీ అధికారి రాజేశ్వరి నియామక పత్రాలను అందజేశారు. వీటిలో 09 మంది హాజరు కాలేదని, 150 మంది ధ్రవపత్రాలను పరిశీలించారు అందులో ఇద్దరు తొలిగింపబడ్డారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన ముగ్గురికి రాష్ట్ర స్పోర్ట్స్ ఆథార్టీ నుంచి వారి ఎంపిక విధానాలు రాలేదు. వికలాంగుల కోటాలో ఎంపికైన వారిలో మెడికల్ నిర్వహించగా వారి పత్రాలు సరైనవి కాకపోవటంతో వారిని తొలిగించారు. ఒకరు అండర్ ప్రసెస్‌లో ఉన్నారు. మొత్తంగా 142మంది జిల్లా లో గ్రామ కార్యదర్శుల నియామక పత్రాలను కార్యదర్శులకు అందజేశారు.

నాగర్‌కర్నూల్ జిల్లాలో..
నాగర్‌కర్నూల్ రూరల్ : నాగర్‌కర్నూల్ జిల్లాలో 166 కొత్త జీపీలు కలిపి 466 పంచాయతీలున్నా యి. అందులో 311 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు కాళీ ఉండగా ఈ మేరకు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిలో నుంచి ఎంపిక చేశారు. కాగా ఇంట ర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేష న్‌కు పది మంది హాజరు కా లేదు. ఎంపికైన వారిలో ఒక రు డిగ్రీ లేనివారు. వికలాంగుల కోటలో మహిళలకు అవకాశం ఉండగా పురుషు లు దరఖాస్తు చేశారు. ముగ్గురు మాజీ సైనికుల కోటాలో దరఖాస్తు చేసుకున్న ముగ్గురు అనర్హులయ్యారు. క్రీడాకారుల కోటాలో దరఖాస్తు చేసుకున్న ఆరుగురి వివరాలను రాష్ట్ర కమిటీ పరిశీలనకు పంపించారు. 19 మంది స్థానిక ధృవ పత్రా లు సమర్పించక పోవడంతో రిజెక్ట్ అయ్యారు. కాగా 266 మందికి శుక్రవారం నియామక పత్రా లు ఇవ్వగా అందులో 240 మంది విధుల్లో చేరినట్లు జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌మోహన్ తెలిపారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...