భావిభారత ప్రధాని కేసీఆరే..


Fri,April 12, 2019 01:54 AM

వెల్దండ : సీఎం కేసీఆర్ భావిభార త ప్రధాని అయితేనే దేశం అన్ని విధా ల అభివృద్ధి చెందుతుందని టీఆర్‌ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి పోతుగంటి రాములు అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేం ద్రంలో పోలీంగ్ కేంద్రాలను ఎంపీ అభ్యర్థి పోతుగంటి రాములు పరిశీలించి, పోలింగ్ సరళిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా వెల్దండ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రా ములు మాట్లాడుతూ.. ఇన్నాళ్లు దేశా న్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీల వి ధాన లోపం వల్లే దేశం వెనుకబాటుకు గురైందన్నారు. జాతీయ పార్టీలు దేశ ప్రజల అవసరాలను తుంగల్లో తొక్కి దేశాన్ని చిన్నాభిన్నం చేశాయన్నారు. తె లంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చే సిన అభివృద్ధికి దేశం మొత్తం తెలంగాణ వైపు చూ స్తున్నాయన్నారు. రాష్ట్ర పభుత్వ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేస్తే దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.

ఫెడరల్ ఫ్రంట్ ద్వారా దేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయించే వ్యక్తే ప్రధాని అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానా లను కైవ సం చేసుకొని కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా మారనుందని తెలిపా రు. నాగకర్నూల్ ప్రజలు స్థానిక అభ్యర్థిని కోరుకుంటున్నారని, స్థానికేతరు లకు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూపతిరెడ్డి, మోహన్‌రెడ్డి, ఈశ్వరయ్య, సంజీవ్‌కుమార్, మధుసూదన్‌రెడ్డి, తాటి కొండ కృష్ణారెడ్డి, వైఎస్‌రెడ్డి, యాదగిరి, శేఖర్, దేవేందర్, సమీర్, శ్రీను, వెంకటయ్య, మల్లయ్య తదితరులు ఉన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...