పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతం


Fri,April 12, 2019 01:53 AM

వనపర్తి టౌన్/రూరల్/గోపాల్‌పేట : జిల్లా కేంద్రంలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా జరిగింది. ఎండతీవ్రత ఎక్కువగా ఉండటం తో ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు భారీగా చేరుకున్నారు. జిల్లా కేంద్రంలోని మహిళ డిగ్రీ కళాశాలలో ఆదర్శ బూత్‌ను ఏర్పాటు చేశారు. కల్యాణమండపాన్ని తలపించేలా ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. గేట్ వద్ద ఓటర్లకు స్వాగతం పలుకుతు బ్యానర్లు కట్టారు. లోపలికి ప్రవేశించగానే ఆర్‌సీలతో మే హై హెల్ప్ యూ, అంటు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఓటర్లకు స్లిప్పులు అందించే విధ ంగా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రంలోను బెలూన్లతో అందంగా అలంకరించారు. దీంతో ఓటర్లు తమ ఓటు హ క్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకోసం వచ్చి న వృద్ధులకు మున్సిపల్ సిబ్బందితో వీల్ చైర్ ద్వారా ఓటు వేసేలా చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఎండతాకిడికి వయోవృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆశా కార్యకర్తలను కేంద్రాల వద్ద ఉంచి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందజేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలతో పాటు ఎన్‌సీసీ విద్యార్థులు కూడా విధు లు నిర్వహించారు.

వనపర్తి మండలంలోని 26 గ్రామ పం చాయతీలో గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో గ్రామాలలో ప్రజలు ప్రశాంతంగా తమ ఓటును హక్కును వినియోగించుకున్నారు. మండలంలోని 14 సమస్యాత్మక గ్రామాలలో వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రంలోని అధికారులు ఆయా గ్రామాలలోని ఎన్నికల సరళిని పరిశీలించారు. రెండు గ్రామాలైన రాజనగరం గ్రా మంలోని బూత్ నెంబరు 148లో, శ్రీనివాసపురం గ్రామంలోని 160 బూత్‌లలో గంట పాటు ఈవీఎంలో మొరాయించాయి. వాటిని అధికారులు సరిచేసి మళ్లీ ఓటింగ్‌ను ప్రారంభించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయింత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా జరిగింది. వికలాంగుల, వృద్ధుల కోసం ప్రత్యేక వాహనల ద్వారా పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చి ఓటును వినియోగించుకొనే లా వలంటీర్లు కృషి చేశారు. మండలంలో మొత్తం 35 బూత్‌లలో మొత్తం 35,023 ఓటర్లకుగాను 22,306 పోలైనట్లు అధికారికంగా సమాచారం. అలాగే గోపాల్‌పేట మం డల కేంద్రంతో పాటు బుద్దారం, పొల్కెపహాడ్, తాడిపర్తి పోలింగ్ బూత్‌లను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పార్లమెంట్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి రాములు, చీఫ్ ఏజెం ట్ రఘునందన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్‌లు సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి తన సొంత గ్రామమైన జయన్నతిరుమలాపూర్‌లో ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. మండలంలో 61.37 శాతం ఓట్లు పోలయ్యాయి. అలాగే తహసీల్దార్ రాధాకృష్ణ పోలిం గ్ కేంద్రాలను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

పెద్దమందడిలో..
పెద్దమందడి : మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లోని 33 పోలింగ్ కేంద్రాల్లో గురువారం కొనసాగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 60.38 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండలంలో మొత్తం 28,762 మంది ఓటర్లు ఉం డగా 17,368 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. అందులో పురుషులు 8689, మహిళలు 867 9 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. పెద్దమందడి మండలంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎస్పీ అపూర్వరావులు పరిశీలించారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మండల కేంద్రంతో మండలంలోని వీరాయపల్లి, గట్లఖానాపూర్, వెల్టూర్, మోజర్ల, జంగమాయిపల్లి, బలిజపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల ను ఆయన పరిశీలించారు. అదేవిధంగా ఎస్పీ అపూర్వరావు మండల కేంద్రంతో పాటు మండలంలోని చిన్నమందడి గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ సరళిని, భద్రతపై ఆరా తీశారు. అనంతరం మంత్రి నిరంజన్‌రెడ్డి రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు మేఘారెడ్డి, నాయకులు సత్యారెడ్డిలతో ఓటింగ్ సరళిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రేవల్లిలో
రేవల్లి : మండలంలో ఆయా గ్రామాలలో గురువారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 59.52 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మండలంలో మొత్తం 17,059 ఓట్లకుగాను, పురుషులు 5193, మహిళలు 4961 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో ఆయా పోలింగ్ కేంద్రాలను స్థానిక తహసీల్దార్ లక్ష్మణ్‌రావు, ఎస్‌ఐ వెంకటేశ్వర్‌గౌడ్ శాంతిభద్రతలను పర్యవేక్షించారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...