ఘనంగా జ్యోతిరావు ఫూలే జయంతి


Fri,April 12, 2019 01:53 AM

వనపర్తి రూరల్ : మండలంలోని పలు గ్రామాలలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. మండలంలోని చిట్యాల గ్రామ శివారులో గల మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలుర గురుకుల పాఠశాలలో ఫూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లుర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని సామాజిక అసమానతలు రూపుమాపడానికి కృషిచేసిన మహానుభావుడన్నారు. అలాగే మండలంలోని రాజనగరం గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో జ్యోతిరావు ఫూలే జయంతిని యూత్ బిల్డింగ్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ లింగం, ఉపాధ్యాయులు అక్బర్, నవీన్, షకీల్, ఎంపీటీసీ విజయమ్మ, గొర్రెల కాపరుల సంఘం జిల్లా చైర్మన్ కురుమూర్తి యాదవు, రాజనగరం యూత్ సభ్యులు పాల్గొన్నారు.

ఖిల్లాఘణపురంలో..
ఖిల్లాఘణపురం : మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఖిల్లా ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లోని ఫూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణాయ్య, జిల్లా సంచార జాతుల సంఘం అధ్యక్షుడు భుమాయ్య, మార్కెట్ కమిటీ సభ్యుడు కృష్ణాయ్య, మాజీ సర్పంచ్ కృష్ణాయ్యగౌడ్, సామ్యానాయక్ పాల్గొన్నారు.
తీలేరు

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...