పోలింగ్ ప్రశాంతం


Fri,April 12, 2019 01:52 AM

వనపర్తి,నమస్తే తెలంగాణ ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ గురువా రం ప్రశాంతంగా కొనసాగింది. జిల్లాలోని 14 మండలాల్లో చెదురుమొదు రు సంఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్ శ్వేతా మొహంతి, ఎస్పీ అపూర్వ రావులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా పెద్దమందడి మండలంలో ఓటింగ్ కొనసాగగా, అత్యల్పంగా రేవళ్లి మండలంలో ఓటింగ్ నమోదైంది. వనపర్తి నియోజకవర్గంలో 60.91 శాతం పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నమో దైంది. చిన్న, చిన్న సమస్యలు మినహా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. జిల్లాలో 539 పోలింగ్ స్టేషన్లు ఉండగా, వనపర్తి నియోజకవర్గం లో 290 పీఎస్‌లున్నాయి. వాటి పరిధిలో పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా సాగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్, సాయంత్రం 5గంటల వరకు ముగిసింది. అయితే, ఉదయం వేళల్లోనే ఓటర్లు తమ ఓటును వేసుకునేందుకు ఆసక్తి కనబర్చారు. మధ్యాహ్నం నుంచి ఓటింగ్ ప్రక్రియ మందకోడిగా సాగింది. నియోజవర్గంలో 2.47.419 మంది ఓటర్లుంటే, లక్షా 50 వేల 700 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో పురుషులు 76,348 మంది ఉంటే, మహిళలు 74,352 మంది తమ ఓటును వినియోగించుకున్నారు.

అత్యధికంగా శ్రీరంగాపురంలో..
నియోజకవర్గంలోని పెద్దమందడి, ఖిల్లా ఘణపురం, గోపాల్‌పేట, రేవళ్లి, పెబ్బేరు, శ్రీరంగాపురం, వనపర్తి మున్సిపాల్టీతో పాటు మండలంలోను పోలింంగ్ కొనసాగింది. వాటిలో శ్రీరంగాపురం మండలంలో 64.92 శాతం అత్యధికంగా పోలింగ్ నమోదైంది. అ త్యల్పంగా రేవళ్లి మండలంలో 59.52 శాతం పోలింగ్ నమోదుకాగా, పెబ్బేరులో 60 శాతం, గోపాల్‌పేటలో 61.37

శాతం, పెద్దమందడిలో 60.38 శాతం, ఖిల్లాఘణపురంలో 61.25 శాతం, వనపర్తి మండలంలో 56.00 శాతం నమోదైంది.

ఈవీఎంల మొరాయింపు
పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. వనపర్తి పట్టణంలోని 8వ వార్డులో ఉర్దు మీడియం పాఠశాలలో ఈవీఎం మొ రాయించగా, దాదాపు గం ట ఆలస్యంతో మరొక ఈవీఎంను ఏర్పాటు చేశారు. వీపనగండ్ల మండల కేంద్రంలో 162వ పోలింగ్ కేం ద్రంలో ఈవీఎం మొరాయించగా, మరొక ఈవీఎం ను అధికారులు తెప్పించారు. వనపర్తి మండలం రా జ నగరం, శ్రీనివాసపురంలోను ఈవీఎం మొరాయించగా, గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.

బారులు తీరిన పల్లె ఓటర్లు..
పార్లమెంట్ ఎన్నికల్లో పల్లె ఓటర్లు ఉదయం వేళలోనే బారులు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు. ఉ దయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియలో కాస్త ముందుగానే ఓటర్లు కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఏజెంట్ల ఏర్పాట్ల అనంతరం మాక్‌పోలింగ్ ప్రక్రియ చేపట్టి పోలింగ్‌ను ప్రారంభించారు. ఉదయం నుంచి 12 గంటల వరకు ఓటర్లు ఆసక్తిగా పోలింగ్ కేంద్రాలకు పరుగెత్తారు. అనంతరం ఎండవేడిమి పెరగడంతో పో లింగ్ మందకోడిగా సాగింది. పల్లె ఓటర్లు మాత్రం ఆసక్తిగా పోలింగ్‌లో పాల్గొంటే.. పట్నం ఓటర్లు మా త్రం ఈ ఎన్నికల్లో ఆసక్తి కనబర్చలేదు. పట్నంలో ఉన్న ఓటర్లు గ్రామాలకు రావడానికి ఆసక్తిగా ఉన్న ఆయా పార్టీలు పట్టించుకోకపోవడంతో ఓటింగ్‌కు పట్నం ఓటర్లు దూరంగానే ఉన్నారు.

మంత్రి,కలెక్టర్, ఎస్పీల పర్యవేక్షణ..
జిల్లాలో కొనసాగిన ఓటింగ్ ప్రక్రియలో మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యవేక్షించారు. నియోజకవర్గంలోని గోపాల్‌పేట, ఖిల్లాఘణపురం, పెద్దమందడి మండల గ్రామా ల్లో మంత్రి పర్యటించి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. కలెక్టర్ శ్వే తా మొహంతి, ఎస్పీ అపూర్వ రా వులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, బీజేపీ ఎంపీ అభ్యర్థి శృతిలు పెబ్బేరు కేంద్రంలో పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఇటు అధికారులు, అటు నాయకుల పర్యవేక్షణలతో పార్లమెంట్ ఎన్నికల సందడి ప్రశాంతంగా ముగిసింది. వనపర్తి పట్టణంలోనే చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది.

ఓటు వేసిన మంత్రి నిరంజన్ రెడ్డి..
పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జిల్లా కేంద్రంలో ని బాలుర జూనియర్ కళాశాలలో 117 పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కలెక్టర్ శ్వేతా మొహంతి మండల పరిషత్ ఆవరణంలోని పోలింగ్ కేంద్రంలో ఓట హక్కు వినియోగించుకుంటే, ఎస్పీ అపూర్వ రావు బాలుర జూనియర్ కళాశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...