ఓటు వేసేందుకు వెళ్తూ.. తండ్రీ కూతుళ్ల దుర్మరణం


Fri,April 12, 2019 01:52 AM

- బైక్‌ను ఢీకొట్టిన వ్యాను
- భార్య, మరో కూతురికి తీవ్రగాయాలుతీవ్ర గాయాలు

మహబూబ్‌నగర్ క్రైం : పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు బైక్‌పై వస్తున్న ఓ కుటుంబాన్ని వ్యాన్ ఢీ కొట్టడంతో తండ్రీ, కూతురు అక్కడి కక్కడే దుర్మరణం చెందిన ఘటన గురువారం పట్టణంలోని ఎస్వీఎస్ దంత వైద్యకళాశాల వద్ద చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సంజయ్ నగర్‌కు చెందిన మండ్ల మల్లేశ్(30) తనభార్య లక్ష్మమ్మ, ఇద్దరు కూతుళ్లు హిమవర్థిని, హిమబిందు(5)తో నివాసం ఉంటున్నారు. మల్లేశ్ వెల్డర్‌గా పని చేస్తూ కుటుంబానికి పోషిస్తున్నాడు. బుధవారం అత్తారింటి వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళారు. గురువారం ఓటు హక్కు వినియోగించుకునేందుకు సంజయ్ నగర్‌కు టీఎస్ 06 ఈఎం 5677 నెంబర్ బైక్‌పై బయలుదేరాడు. మహబూబ్ నగర్ శివారులోని అప్పన్నపల్లి ఎస్వీఎస్ డెంటల్ కళాశాల వద్దకు చేరుకోగానే.. ఎదురుగా వస్తున్న టీఎస్ 12 ఈఈ 1676 గల వ్యాన్ అతి వేగంగా వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ప్రమాదస్థలిలోనే మల్లేశ్, హిమబిందు మృతి చెందారు. అతని భార్య, మరోకూతురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు 108 ద్వారా ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై భాస్కర్‌రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాలను, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దవాఖానలోని మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన వారిపై మృతుని తల్లి లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మల్లేష్ మృతివార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున్న దవాఖానకు చేరుకొన్నారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...