మునిమోక్షంలో కల్లు తాగి వ్యక్తి మృతి


Fri,April 12, 2019 01:52 AM

- షాపు యజమానికి రూ.70 వేలు జరిమానా
హన్వాడ : మండలంలోని మునిమోక్షం గ్రామంలో ఓ వ్యక్తి కల్తీకల్లు తాగి మృతి చెందిన ఘటన బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇదే గ్రామానికి చెందిన అంగయ్య బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు గ్రామంలో ఉన్న కల్లు దుకాణంలో కల్లు తాగాడు. అక్కడే కొద్దిసేపు కూర్చొని ఉండి బోర్లపడి అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేసి.. ఎన్నికల కోడ్ ఉన్నా.. ఇష్టానుసారంగా ఎలాంటి అనుమతి లేకుండా కల్లు ఎలా అమ్ముతున్నావని ప్రశ్నించారు. మృతిని కుటుంబానికి కల్లు షాపు యాజమన్యంతో రూ.70 వేల రూపాయలను పరిహారంగా చెల్లించాలని నిర్ణయించారు. గతంలో ఇప్పుటికే రెండు సంఘటనలు ఇలాగే జరిగాయన్నారు. బయట ఎవరికీ చెప్పకుండా గ్రామస్తులతో పంచాయతీ పెట్టి జరిమానాలు విధించారన్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...