పోలింగ్ కేంద్రాల్లో.. వెబ్ క్యాస్టింగ్


Thu,April 11, 2019 01:37 AM

వనపర్తి రూరల్ : నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వనపర్తిలో మొత్తం 9 మండలాలల్లోని మొత్తం 2,47,419 మంది ఓటర్లులు ఉండగా.. వీరందరూ ఓటు హక్కును వినియోగించుకొనేలా 290 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వనపర్తి నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా జరిపించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపటింది. ఇందులో భాగంగా 62 సమస్యాత్మక కేంద్రాలతో పాటు సాధారణ కేంద్రాలల్లోనూ శాసన, పంచాయతీ ఎన్నికలలో ప్రయోగాత్మాకంగా వెబ్ క్యాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేసి ఆయా కేంద్రాలలో జరుగుతున్న పోలింగ్ తీరును ప్రత్యేక్షంగా వీక్షించారు. రాష్ట్రంలోని ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ప్రధాన అధికారితో సహ జిల్లా కేంద్రాంలోని జిల్లా రిటర్నింగ్ అధికారులు కార్యాలయంలో ఉండి పోలింగ్ కేంద్రాలలో జరుగుతున్న పోలింగ్ తీరును ప్రత్యేక్షంగా వీక్షించి, తగు చర్యలు తీసుకున్నారు. అదే పద్ధతిని ఈనెల 11వ తేదీన జరుగుచున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నారు. ఇందు కోసం ప్రతి కేంద్రానికి రెండు కెమెరాలు అవసరమని గుర్తించారు. ఇదివరకే వాటిని తెప్పించి, వాటిని పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేశారు.

అన్ని కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్..
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్‌క్యాస్టింగ్ కెమెరాలను బిగించనున్నారు. సంకేతాలు అందేచోట ప్రత్యేక్ష ప్రసారానికి ఏర్పాట్ల చేశారు. మిగిలిన చోట పోలింగ్ ప్రారంభం నుంచి ముగిసేవరకు ప్రతి దృశ్యాన్ని రికార్డు చేయనున్నారు. ఎక్కడైనా అనుకొని సంఘటనలు చోటు చేసుకుంటే ఆ తర్వాత బాధ్యులెవరో గుర్తించి తగు చర్యలు తీసుకొనేందుకు వెబ్‌క్యాస్టింగ్ రికార్డులు ఉపయోగపడునున్నాయి. ఇప్పటికే నియోజక పరిధిలోని ఏ ఏయే పోలింగ్ కేంద్రాలల్లో వెబ్ కెమెరాలను బిగించాలో ఆధికారుల ఆదేశాల మేరకు వాటిని బిగించారు. ఇప్పటికే సమస్యాత్మాక కేంద్రాల నుంచి ప్రత్యేక్ష ప్రసారానికి కావాల్సిన ఏర్పాట్లను సాంకేతిక సిబ్బంది ఆయా కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం మీదుగా సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో ఈ లోక్‌సభ ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు వెబ్ క్యాస్టింగ్‌ను ఎన్నికల సంఘం ఒక ఆయుధంగా వినియోగించుకోనుంది.

నియోజకవర్గంలోని సమస్యాత్మక కేంద్రాలు
వనపర్తి నియోజక వర్గ పార్లమెంట్ ఎన్నికల పరిధిలోని 9 మండలాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా ఎన్నికల సంఘం, పోలీసు అధికారులు గుర్తించారు. వీటి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సీసీ కెమార, వెబ్ క్యాస్టింగ్‌ల ద్వారా పోలింగ్ సరళీ పరిశీలించి, తగు చర్యలు తీసుకొనేందుకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. వీటిలో ఒక్క శ్రీరంగపురం మండలంలో ఎటువంటి సమస్యాత్మక కేంద్రాలు లేక పోవటం విశేషం. వీటిలో వనపర్తి -14, గోపాల్‌పేట-09, రేవల్లి -07, పెబ్బేర్ - 04, పెద్దమందడి -04, ఖిల్లాఘణపురం - 08, మూసాపేట -04 , అడ్డాకల్ -10 గ్రామాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...