పోలింగ్‌కు సర్వం సిద్ధం


Thu,April 11, 2019 01:37 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గ్రామాల్లో పోలింగ్ కోసం అధికార యంత్రాం గం ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఎన్నికలకు అవరసరమైన పోలింగ్ సిబ్బందిని గ్రామాలకు తరలించింది. సంబంధిత అధికారులకు ఈవీఎంలను అప్పగించి పోలింగ్‌కు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. నెల రోజులుగా ఉత్కంఠతగా ఎదురు చూస్తు న్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమయం వచ్చేసింది. నామినేషన్లు, ప్రచారాల ప్రక్రియను పూర్తి చేసుకుని గురువారం పోలింగ్‌ను కొనసాగించేందుకు ఏ ర్పాట్లు పూర్తయ్యాయి. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిదిలో 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న క్రమం లో ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. టీఆర్‌ఎస్ నుంచి పోతుగంటి రాములు, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి బంగారు శృతి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. బహిరంగ ప్రచారాల గడువు ముగిసిన అనంతరం ఆయా పార్టీల నేతలు పోలింగ్ పక్రియలపైనే దృష్టి పెట్టారు.

గ్రామాలకు తరలిన ఈవీఎంలు..
పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ మైదానం నుంచి ఆయా గ్రామాలకు ఈవీఎంలు, ఇతర సామగ్రిలను ఆర్టీసీ బస్సుల ద్వారా తరలించారు. ఉ దయం నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ మధ్యాహ్నం వరకు కొనసాగింది. అనంతరం వాహనాలన్నీ తమకు కేటాయించిన గ్రామాలకు తరలి వెల్లాయి. కలెక్టర్ శ్వేతామొహంతి ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో జేసీ వేణుగోపాల్, ఆర్డీవో చంద్రారెడ్డి, డీఈవో సుశీందర్‌రావు, డీఎస్‌పీ సృజన, సీఐ సూర్యనాయక్‌లు పర్యవేక్షించారు. మొత్తం ని యోజకవర్గంలో 175 ప్రాంతాల్లో 290 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకుగాను 319 మంది పో లింగ్ అధికారులు, మరో 319 మంది ఏపీవోలు, 638 మంది ఓపీవోలు, 26 మంది సెక్టోరియల్ అధికారులు, 46 మంది మైక్రో అబ్జర్వర్లను పోలింగ్ ప్రక్రియ కోసం ఏర్పాటు చేశారు.

2.47 లక్షల మంది ఓటర్లు..
నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల్లో 2.47.419 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో పురుషులు 1.24 వేల 406 మంది కాగా, మహిళా ఓటర్లు 1.22.998 మంది ఓటు హ క్కును వినియోగించుకోనున్నారు. పార్లమెంట్ ఓటింగ్ ప్రక్రియలో వెబ్‌కాస్టింగ్‌ను సహితం ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 280 వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లను చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోను వృద్ధుల కోసం దాదాపు 205 వీల్ చైర్స్‌ను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రథమ చికిత్స కోసం 175 మంది ఏఎన్‌ఎంలను ప్రత్యేకంగా నియమించారు. మరో 290 మంది స్వచ్ఛంద వలంటీర్లను కూడా సిద్ధంగా పోలింగ్ కేంద్రాల్లో నియమించి సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు.

ప్రత్యేక బందోబస్తు..
జిల్లాలో పార్లమెంట్ ఎన్నిలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎస్పీ అపూర్వరావు ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లాలోని 14 మండలాల్లో మొత్తం 539 పోలింగ్ కేంద్రాలుంటే, వాటి పరిధిలో 62 సమస్యాత్మక గ్రామాలున్నట్లుగా అధికారులు గుర్తించారు. 1306 మంది పోలీస్ సిబ్బందిని ఎన్నికల్లో ఉపయోగిస్తున్నారు. సీఐ, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలతో పాటు 53 మొబైల్ టీమ్స్, 9 ైప్లెయింగ్ స్వాడ్స్, 6 ఎస్‌ఎస్ టీమ్స్, 15 ైస్టెకింగ్ ఫోర్స్‌లతో పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

డబ్బులు, మద్యం ఓటర్లకు పంపిణీ చేసినా, నేర పూరిత చర్యలకు పాల్పడినా, ఎన్నికల సంఘం నిబంధ నలకు వ్యతిరేకంగా వ్యవహరించి నా కఠిన చర్యలుంటా య ని ఎస్పీ పేర్కొన్నారు. ఎక్కడైన అవాంఛనీయ సం ఘటనలు జరిగే అవకాశం ఉంటే ముందు జాగ్రత్తగా 100 కు సమాచారం ఇస్తే వెంటనే స్పందించేలా పోలీస్‌శాఖను సిద్ధం చేసినట్లు తెలిపారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...