బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతోనే.. దేశం వెనుకబాలు


Thu,April 11, 2019 01:36 AM

కొల్లాపూర్, నమస్తేతెలంగాణ : దేశం అభివృద్ధి చెందకపోవడానికి కారణం 70 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలేనని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కూడా దేశంలో అమలుచేసే శక్తి సీఎం కేసీఆర్‌కే ఉందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలువబోతున్నారని, దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా తీసుకురావడం జరుగుతుందన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు ఆలోచించి అభివృద్ధిచేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి రాములుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కులేదని జూపల్లి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కొంత పోరపాట్లు జరిగాయని అలాంటివి జరుగకుండగా ఈసారి కొల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి రాములుకు భారీ మెజార్టీ తీసుకొచ్చి ప్రత్యేకతను పొందాలన్నారు. ఎమ్మెల్యే ఎన్నికలలో నష్టం జరిగినప్పటికీ సర్పంచ్ ఎన్నికలల్లో పుంజుకున్నామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ తెలంగాణ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్, జడ్పీటీసీ హన్మంత్‌నాయక్, మాజీ జడ్పీటీసీ కృష్ణప్రసాద్‌యాదవ్, సింగిల్‌విండో చైర్మన్ రఘుపతిరావు, నాయకులు నర్సింహ, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు వెంకటస్వామి తదితరులున్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...