ఐదేళ్లలోనే 70 ఏళ్ల అభివృద్ధి


Tue,March 26, 2019 02:06 AM

చిన్నంబావి : 70 ఏళ్లలో చేయని అభివృద్ధిని ఐదేండ్లలో చేసి చూయించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని, లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి పోతుగంటి రాములును భారీ మె జార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా వు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో టీఆర్‌ఎస్ తరపున లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న 16 మంది ఎంపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. రా ష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణ ఖర్చులకు ఎలాంటి అడ్డంకులు ఉండవని, ఎంతో కాలంగా పెం డింగ్‌లో ఉన్న ఏబీసీడీ వర్గీకరణ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్ల బిల్లులు పాస్ చేసుకునే అవకాశం ఉంటుందన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను చూసి కేం ద్రం, ఇతర రాష్ర్టాలు అవలంభిస్తున్నాయన్నారు. దేశ ప్రజలంతా తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులవుతున్నారన్నారు. రాములు గెలు పు ఎప్పుడో ఖాయమైందని, మనం కేవలం మెజార్టీ కోసం కృషి చేయాలన్నారు. సీఎం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తే చాలన్నారు.

చిన్నంబావి మండ ల చివరి ఆయకట్టు ఎండిపోకుండా ఉండేందుకు సిం గోటం రిజర్వాయర్ నుంచి గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు నీటిని తరలించి అక్కడి నుంచి చిన్నంబావి చివరి ఆ యకట్టు రైతులకు సాగునీరందిస్తామని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.200ల కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే చెల్లెపాడు, చిన్నమారూర్ ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ పనులకు నిధులు మంజూరు చేశామని, పాడైన మోటర్ల స్థానంలో కొత్త మోటార్లు ఏర్పాటు చేసి వచ్చే పంటకు సాగునీరందిస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలో నిజం లేదని, కొందరు కావాలని సోషల్ మీడియాలో పార్టీ మారుతానని అసత్య ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్‌యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీ కృష్ణప్రసాద్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు తేజారెడ్డి, సర్పంచ్‌లు రంజిత్‌కుమార్, సురేందర్, టీఆర్‌ఎస్ నాయకులు రాజు, సతీష్, రమేష్, శ్రీనివాసులు, నరేష్ పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...