మట్టి కుండలకు మంచి గిరాకీ


Tue,March 26, 2019 02:05 AM

- తరాలు మారినా తగ్గని ఆదరణ
- వేసవిలో మట్టి కుండలకు పెరుగుతున్న డిమాండ్
వనపర్తి క్రీడలు : వేసవి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు. తడారిన గొంతును తడుపుకేందుకు చల్లని నీటిని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇప్పటి మార్కెట్‌లో మట్టి కుండలు, కుజా ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఆరోగ్యరిత్యా సంపన్నులు కూడా కుండలోని నీటిని తాగేందుకే మొగ్గు చూపుతుండడం తో పేదవాడి ఫ్రిజ్‌లకు గిరాకీ పెరుగుతోంది. ఫ్రిజ్‌లోని నీళ్లకం టే మట్టికుండలో ఉన్న చల్లని నీరే ఎంతో శ్రేయస్కరం కావడంతో ప్రజలు మట్టి కుండలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫ్రిజ్‌లు కొనలేని వారు వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు పేదవాడి ఫ్రిజ్‌నే ఆశ్రయిస్తుంటారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల పక్కన ఇప్పటికే అమ్మకాలు జోరందుకున్నాయి. గతేడాది ఒక్క కుండ రూ.80 నుంచి 100 వరకు ఉం టే.. ఈ ఏడాది మాత్రం ఒక్క సారిగా ధరలు రెట్టింపై ఒక్కో కుండ ధర రూ.150 నుంచి 200ల వరకు పలకుతోంది. ధరలు పెరిగినప్పటికీ.. వాటికి డిమాండ్ మాత్రం తగ్గడంలేదంటున్నారు వినియోగదాలు. మార్కెట్‌లోకి ఎన్ని రకాల ఫ్రిజ్‌లు వస్తున్నప్పటికీ కుండలకు ఉన్న డిమాండ్ మాత్రం రోజు రోజకు పెరుగుతోంది. ఫ్రిజ్ నీటిని తాగటం వల్ల ఇన్ఫెక్షన్, జలుబు లాంటివి వస్తుండడంతో చల్లని నీటి కోసం ప్రజలు కుండలను కొనుగోలు చేస్తున్నారు. కుండలోని నీటిని తాగితే ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పైగా తక్కువ ఖర్చు, విద్యుత్ అవసరం కూడా లేదు. చలివేంద్రాల్లో సైతం కూజాలనే వినియోగిస్తారు. అందుకే మార్కెట్‌లోకి ఫ్రిజులు వచ్చిన మట్టి కుండల స్థానం మాత్రం నేటికి పదిలంగానే ఉంది.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...