టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టండి


Tue,March 26, 2019 02:05 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ/వనపర్తి రూరల్ : పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, పట్టణాధ్యక్షుడు గట్టుయాదవ్‌లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా చిట్యాల రోడ్డులో గల చింతల హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పట్టణంలోని 1, 2, 3వ వార్డులలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్లు శారద, కౌన్సిలర్లు, నాయకులతో కలిసి వారు నిర్వహించారు. ఆయా వార్డులోని ప్రతి ఇంటింటికి వెళ్తూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ, కూ రగాయల మార్కెట్ వద్ద విక్రయదారులతో కాసేపు మా ట్లాడి పార్లమెంట్ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేయాలని వారు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తున్న పి.రాములుకు భారీ మెజార్టీని అందిం చాలని కోరారు.

సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని గుర్తు చేశారు. ఇంకా అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. అలాగే వనపర్తి మండలం నాచహళ్లి గ్రామంలో కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం మాజీ కన్వీనర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలిస్తేనే కేంద్రం నుంచి నిధులు భారీగా తీసుకురావటానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, కౌన్సిలర్లు శ్రీధర్, తిరుమల్, ఇందిరమ్మ, కమలమ్మ, పార్వతమ్మ, ప్రమీలమ్మ, రమేష్‌నాయక్, నాయకులు రాములు యాదవ్, శ్యాం, రాజు, గులాంఖాదర్, గిరి, మురళీసాగర్, పరంజ్యోతి, శ్రీనివాసులు, తిరుమల్, తిరుపతయ్య, కేశవులు, వెంకటేష్, రాము, జయానంద్, కృష్ణ, లక్ష్మి, జమ్ములమ్మ, ఎంపీపీ శంకర్‌నాయక్, మండలాధ్యక్షుడు మాణిక్యం, మాజీ జెడ్పీటీసీ వెంకట్రావ్, ధర్మనాయక్, సర్పంచ్ భాగలక్ష్మి, రవి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు నరసింహా, ఉస్మన్, మనోహర్, నాయకులు లక్ష్మయ్య, వెంకటయ్య, రాములు, అబ్దుల, గోపాల్, సాగర్, ప్రత్యూష్ గౌడ్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...