ధర్డ్ ఫ్రంట్‌కు సహకారం అందించాలి..


Tue,March 26, 2019 02:04 AM

వీపనగండ్ల : నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాములుకు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ అందించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. సోమవారం వీపనగండ్ల మండలంలోని ముఖ్య నాయకు లు, కార్యకర్తలతో స మావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ ఏళ్ల తరబడి కేంద్రంలో పరిపాలన కొనసాగిస్తు న్న కాంగ్రెస్, బీజేపీలకతీతంగా సీఎం కేసీఆర్ నాయకత్వాన థర్డ్‌ఫ్రం ట్ ఏర్పాటుకు మన వంతు సహకారం అందించాలని కోరారు. కేంద్రంలో మన వంతు పాత్ర ఉన్నప్పుడే పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించుకునే హక్కు మనకు ఉంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయినా.., పదవి లేకపోయినా.., ప్రజాతీర్పును గౌరవిస్తూ సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధికి నిరంతరం సైనికుడిలా కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైకని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఆంధ్రా నాయకుల దోపిడీని అరికట్టేందుకు తెలంగాణ సాధనే లక్ష్యంగా మంత్రి పదవిని త్యాగం చేసి టీఆర్‌ఎస్ పక్షాన పోరాడిన ఘనత జూపల్లి కృష్ణారావుకే దక్కుతుందని, ఇందులో కొల్లాపూర్ ప్రజల భాగస్వామ్యం కూడా ఉందన్నారు. పదవులు లేకపోయినా కొల్లాపూర్ అభివృద్ధికి జూపల్లి నిత్యం పాటుపడుతారని తెలిపారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ బాల్ రెడ్డి, సర్పంచులు నరసింహా రెడ్డి, నారాయణ, రవీందర్ రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు కమలేశ్వర్ రావు, సుదర్శన్ రెడ్డి, గంగిరెడ్డి, సురేందర్ రెడ్డి, వెంకటేష్, సురేష్ రెడ్డి, బాలు, నారాయణ, నర్శింహులు, అంజి, సర్ధార్, కళాకారుడు నాగులు తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...