ఏసీబీ వలలో వీఆర్‌ఏ


Tue,March 26, 2019 02:04 AM

పెద్దకొత్తపల్లి: భూమి పట్టా పాసు బుక్కు కోసం వీఆర్‌ఏ రూ.5వేలు రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టబడిన సంఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మారెడుమాన్‌దిన్నె గ్రామానికి చెందిన సొప్పరి నర్సింహకు చెందిన సర్వే నెంబర్ 126/7 భూమి పాసు బుక్కు కోసం అదే గ్రామానికి చెందిన వీఆర్‌ఏ శ్రీధర్ రూ.5వేలు లంచం డిమాండ్ చేయడంతో నర్సింహ ఈనెల 18న మహబూబ్‌నగర్‌లో ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశాడు. 19న నర్సింహ మరోసారి ్ల వీఆర్‌ఏను కలిసి తక్కువ డబ్బులు తీసుకోవాలని కోరాడు. రూ.5వేలు ఇవ్వాల్సిందేనని వీఆర్‌ఏ డిమాండ్ చేశాడు. ఈమేరకు నర్సింహ వీఆర్‌ఏ శ్రీధర్‌కు ఫోన్ చేసి పిలిపించి రూ. 5 వేలు ఇస్తుండగా వెంటనే అధికారులు పట్టుకొని నగదు స్వాధీనం చేసుకొని తహశీల్దార్ కార్యా లయంలో విచారణ చేస్తున్నారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్, సీఐలు కమల్‌కుమార్, లింగస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు వివిధ పనులకు ప్రజల నుంచి లంచం డిమాండ్ చేస్తే ప్రజలు నేరుగా టోల్‌ఫ్రీ నెం.1064కు ఫోన్ చేస్తే వారు ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచి పట్టుకుంటామని తెలిపారు. అ నంతరం తహశీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో విచా రణ కొన సాగించారు. పట్టుబడిన వీఆర్‌ఏను ఏసీబీ కోర్టుకు తరలి స్తామని డీఎస్పీ తెలిపారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...