వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు.. పత్తి దగ్ధం


Tue,March 26, 2019 02:04 AM

అచ్చంపేట రూరల్: పట్టణంలోని అంబేద్కర్ భవనం సమీపంలో సోమవారం మధ్యాహ్నం విద్యుత్ తీగలు తగిలి నిప్పురవ్వలు పడటంతో లారీలో పత్తి దగ్ధమైంది. అగ్నిమాపక శాఖ అధికారి యాదయ్య కథనం ప్రకారం బల్మూర్ మండలం మహాదేవ్‌పూర్ గ్రామానికి చెందిన ముచ్చపోతు రాజు ఏపీ 27టీ 7551 నెంబరుగల లారీలో 15 క్వింటాళ్ల పత్తి నింపుకొని అంబేద్కర్ చౌరస్తా మీదుగా అచ్చంపేట-లింగాల ప్రధాన రహదారిలో వెళ్తుండగా టంగాపూర్ కాలనీ వద్ద విద్యుత్ తీగలు తగిలి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన లారీ డ్రైవర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే వచ్చి నీటితో మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది.దీంతో 80 శాతం పత్తి వరకు మాత్రమే కాలిపోయింది. పత్తి విలువ సుమారు రూ. లక్షా 90 వేల వరకు ఉంటుందని బాధితుడు పిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

జడ్చర్ల ఇండస్ట్రీయల్ ఏరియాలో..
జడ్చర్ల రూరల్ : జడ్చర్ల ఇండస్ట్రీయల్ ఏరియాలో సోమవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో లక్షల రూపాయల విలువైన పత్తి కాలిపోయింది. స్థానికులు, ఫైర్ సిబ్బంది కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.జాతీయ రహదారి సమీపంలోని ఇండస్ట్రీయల్ ప్రాంతంలో నిర్వహిస్తున్న మహేశ్ కాటన్ ఇండస్ట్రీస్‌లో సోమవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా పత్తికి మంటలు అంటుకోవడంతో వాటిని ఆర్పేందుకు ఇండస్ట్రీయల్ వారు ప్రయత్నిస్తూ ఫైర్‌స్టేషన్‌కు ఫోన్‌ద్వారా సమచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కాగా అప్పటికే దాదాపు లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు వారు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని విద్యుత్ ప్రమాదమా లేక మానవ తప్పిదమా అనే వివరాలు ఇంకా తెలియ రాలేదని వారు తెలిపారు. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది శ్రీకాంత్ రెడ్డి, రాజు, చంద్రశేఖర్, ఖుర్షీద్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...