వనపర్తికి గులాబీ బాస్


Mon,March 25, 2019 02:43 AM

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 31వ తేదీన నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ పరిధిలోని వనపర్తి జిల్లా కేంద్రంలో జరగబోయే ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా సీఎం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ పార్లమెంటరీ సభల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ వస్తున్న సభను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. ఈ సభ ఉమ్మడి జిల్లాలోనే చరిత్రలో నిలిచేలా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. సోమవారం దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది. సీఎం సభను విజయవంతం చేసేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఇప్పటికే ఎంపీ అభ్యర్థి రాములుకు మద్దతుగా నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు జరుగుతున్నాయి. మంత్రి సింగిరెడ్డి ప్రచార బాధ్యతలను భుజాన వేసుకొన్నారు. ఇక ఎమ్మెల్యేలకు కూడా కేటీఆర్ ఆదేశించడంతో ఇప్పటికే తాము అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన మెజారిటీని మించేలా బూత్ లెవల్ అధికారులకు సూచనలు ఇచ్చారు. తమతమ నియోజకవర్గాల్లో ప్రచార షెడ్యూల్ రూపొందించుకొని రాములును ఆహ్వానిస్తున్నారు. దీంతో తొలిసారిగా రాములు నాగర్‌కర్నూల్ అసెంబ్లీలో నామినేషన్ వేసిన రోజునే పుల్జాల గ్రామంలో ప్రచారం చేపట్టారు. ఆ తర్వాత గద్వాలలో, ఆదివారం అచ్చంపేట నియోజకవర్గం వంగూరులో ప్రచారం చేపట్టారు.

అభ్యర్థి రాములు ఓ వైపు ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఎమ్మెల్యేలు సైతం సొంతంగా ప్రచార షె డ్యూ ల్, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసుకొ ని ముందుకు సాగుతున్నారు. సీఎం కేసీఆర్ వనపర్తికి వచ్చే నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఇలా విభిన్న బౌగోళిక స్వరూపంతో మూడు జిల్లాల పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించిన నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానంలో ఎంపీ అభ్యర్థి రాములు ప్రచారం మంత్రి సింగిరెడ్డితో పాటుగా ఎమ్మెల్యేలు సైతం బాధ్యతగా తీసుకొన్నారు. కాగా సీఎం కేసీఆర్ సభ ఖరారు కావడంతో ఈ పరిధిలోని టీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా సమావేశాలతో పోలిస్తే ఈ సభ ప్రత్యేకంగా నిలవబోతోంది. ఏడు నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా 16లక్షల మంది ఓటర్లు ఉన్నారు. దీంతో ఈ సభకు ఆయా ప్రాంతాల నుంచి లక్షల మంది తరలి రానున్నారు. సీఎం కేసీఆర్ ఎంపీ ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా నిర్దేశించారు.మొత్తం 16పార్లమెంట్ స్థా నాల్లో గెలిచి కేంద్రంలో నాయకత్వం వ హించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ నేపథ్యంలో జరగబబోయే సభ ఉ మ్మడి జిల్లాలోనే ఇప్పటి వరకూ జరగనట్లుగా ప్రత్యేకంగా నిలవబోతోంది. ఈ సభవేదికను, నియోజకవర్గాల్లో ఎంత మంది చొప్పున తరలి రానున్నారు, ఆ యా వా హనాలకు పార్కింగ్ ఏర్పాట్లు, సభా వేదిక వద్ద ప్రజలకు సౌకర్యాలు, తదితర అంశాలపై సోమవారం మంత్రి సింగిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఖరారు చేయనున్నారు. వచ్చే ఆదివారం ఈ సభ జరగనుండటంతో మంగళవారం నుంచే సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. మొత్తం మీద నాగర్‌కర్నూల్ పార్లమెంటరీస్థాయిలో వనపర్తిలో జరిగే సభ పార్టీ శ్రేణుల్లో జోష్‌ను నింపనుండటంతో పాటుగా ప్రజల్లోనూ సరికొత్త ఉత్సాహాన్ని నింపనుంది.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...