టార్గెట్.. ఐపీఎల్


Mon,March 25, 2019 02:42 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్‌ను ఆస్వాదించే ప్రియులకు పండుగ వాతావరణం కనిపిస్తున్నది. క్రికెట్‌ను గ్రామీణ, ప ట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క రూ వీక్షిస్తున్నారు. క్రికెట్‌పై మోజు ఉన్న యువత బెట్టింగ్‌ల అవతారం ఎత్తుతున్నారు. రెండు జట్ల మధ్య జరిగే ఆట కాస్త జూదంలా మారిపోయింది. బెట్టింగ్ మోజులో పడి యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులను సంపాదించుకోవచ్చనే దురాలోచనతో బెట్టింగ్ రాయుళ్లు చూయిం చే ఆఫర్లకు విలువైన వస్తువులను గిరివి (తాకట్టు) పెట్టి మరీ బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఐపీఎల్ బెట్టింగ్‌లు చాప కింద నీరులా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు పాకిపోయింది. జిల్లా కేంద్రంలో ఏ వీధిలో చూసిపా ఐపీఎల్ బెట్టింగ్‌ల జోరు పెరిగిపోతున్నది. బెట్టింగ్‌లను కాస్తూ మ్యాచ్‌ను తిలకిస్తూ మద్యాన్ని సేవించడం ఒక వ్యసనంలా మా రుతున్నది. గెలిచిన వాడికి ఓడిన వాడు అప్పుడే డబ్బులు కట్టాలి. ఆ సమయంలో డబ్బులు లేకపోవడం లేదా బెట్టింగ్ వేసిన టీం వరుసగా ఓడిపోవడంతో చాలా మంది అప్పుల పాలై గొడవలు పడిన సందర్భాలు కనిపిస్తునే ఉంటాయి. ఆ గొడవలు చినికి చినికి గాలి వానలా మారి పెద్ద సంఘటనలకు దారి తీసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

సామాజిక మాధ్యమాలే ప్రచారాస్ర్తాలు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారం భ దశలో సామాజిక మాధ్యమాలు పెద్దగా అందుబాటులో లేకపోవడంతో యువత బెట్టింగ్‌ల జో లికి వెళ్లేది కాదు. ఐదేళ్లుగా ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్స్, ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాలు విస్తృతంగా చేరువలోకి రావడంతో బెట్టింగ్‌ల హవా మొదలైంది. పది మంది యువతకు కలిపి ఒక వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా ఎవరికీ అనుమానాలు కలుగకుండా బెట్టింగ్‌లను కాస్తూ అప్పుల పాలు అవుతున్నారు.

గూగుల్‌లో సమాచారం అందుబాటులో..
నూతన అంశాలను తెలుసుకోవడానికి ప్రతి ఒ క్కరూ గూగుల్‌ను వినియోగిస్తుంటారు. దీనిని ఐ పీఎల్ బెట్టింగ్‌ను ఎలా వేయాలి, బెట్టింగ్ యాప్ లు వంటి వాటిని బెట్టింగ్ రాయుళ్లు ఉపయోగించుకుంటున్నారు. గతంలో ఆట పూర్తి కాగానే అం దరూ ఒకే దగ్గరకు చేరుకుని గెలిచిన వాడు ఓడిన వాళ్ల దగ్గర డబ్బులను వసూళ్లు చేసుకునేవారు. ప్రస్తుతం ప్రతి ఒక్కటి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రావడంతో డబ్బులను పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే, మనీ ట్రాన్స్‌ఫర్ వంటి యాప్‌ల ద్వారా అకౌంట్లకు డబ్బులు మారుతున్నాయి.

బెట్టింగ్ రాయుళ్లు ప్రధానంగా యువతను టా ర్గెట్ చేస్తున్నారు. పది మంది యువతలో ఒ కరు బెట్టింగ్ రాయుళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తా రు. వీరికి బెట్టింగ్ రాయుళ్లు మ్యాచ్ ఓడినా, గెలిచినా ఐదు శాతం చొప్పున ఇవ్వడంతో అనుకూలంగా వ్యవవహరించే వ్యక్తి యువతను బెట్టింగ్‌ల వైపు ప్రోత్సహిస్తున్నారు. ప్రధాన చౌరస్తాలను, ఎటువంటి సంచారం లేని వీధులను ఎం పిక చేసుకుని ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్లకు అనుకూలంగా ఉన్న వ్యక్తి యువతతో మాట్లాడి 41 రోజులలో ఏడాది కి సరిపడా డబ్బును సంపాదించవచ్చంటూ రెచ్చగొట్టి బెట్టింగ్‌ల కూపంలోకి దింపుతున్నారు.

యువత పాలిట జూదం..
ఐపీఎల్ బెట్టింగ్ యువత పాలిట జూ దంగా మారింది. బెట్టింగ్ కాసే దగ్గర వ్య క్తులు లేనప్పటికీ ఆన్‌లైన్‌లో డబ్బులు పంపిస్తే చాలు. ప్రధాన టీంలకు ఒక రే టు, మామాలు టీంలకు ఒక రేటును బె ట్టింగ్ రాయుళ్లు ఫిక్స్‌డ్ చేస్తారు. ప్రధాన టీంలో ప్రతి ఓవరుకు లేదా ప్రతి బ్యాట్‌మెన్స్ సాధించే పరుగుల మీద, ప్రతి బౌలర్ తీసే వికెట్లపై ఒక్కో రేటును ఫిక్స్‌డ్ చేయడంతో యువత బెట్టింగ్‌ల వైపు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. మొదటి రెండు రోజులు సరాదాగా అలవాటైన బెట్టింగ్‌లు జూదంలా మారి ప్రతి ఏడాది ఎక్కడ ఉన్నా ఫోన్‌లలో బెట్టింగ్ వేస్తున్నారు. బెట్టింగ్ కాసే సమయంలో డబ్బులు లేకుంటే ఖాళీ ప్రామిసరీనోట్ మీద సంతకం లేదా బైకులు, మొబైల్స్‌ను పెట్టుకుని రూ.పది మిత్తితో బెట్టింగ్ రాయుళ్లే డబ్బులను ఇవ్వడం విశేషం.

బెట్టింగ్‌ను అరికట్టాలంటే..
ఐపీఎల్ బెట్టింగ్‌లను పూర్తిగా అరికట్టాలంటే విద్యార్థులు, యువకులపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టిని సారించాలని పోలీసులు సూచిస్తున్నారు. క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడే వారే దానిపై ఉన్న మోజుతో ఊబిలోకి కూరుకుపోతున్నారని హెచ్చరిస్తున్నారు. మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో పిల్లలు టెన్షన్‌గా ఉండటం, సెల్, ల్యాప్‌ట్యాప్, కంప్యూటర్ల వినియోగం అధికంగా ఉన్నట్లయితే వారిని ఆరా తీయాలి. అదే విధంగా మనీ ట్రాన్స్‌ఫర్లపై దృష్టి పెట్టాలి. దీని వల్ల బెట్టింగ్ ఊబి నుంచి బయట పడడానికి అధిక అవకాశాలుంటాయి.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...