నేడే ఆఖరు


Mon,March 25, 2019 02:41 AM

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : నాగర్‌కర్నూల్(ఎస్సీ) లోక్ సభ స్థానానికి సోమవారం నామినేషన్ల గడువు ముగియనుంది. గత సోమవారం నామినేషన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్ నుంచి పోతుగంటి రాములు, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి బంగారు శృతిలు నామినేషన్లు వేశారు. ఇక స్వతంత్ర అభ్యర్థిగా ఒకే ఒక్క అభ్యర్థి బుద్ధుల శ్రీనివాసులు నామినేషన్ వేయడం గమనార్హం. ఇలా మొత్తం ఏడు రోజులు పూర్తి కాగా మూడు రోజులు సెలవులే ఉన్నాయి. చివరగా సోమవారం మాత్రమే చివరి రోజు కావడంతో ఇతర పార్టీలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థుల నుంచి కూడా భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశమున్నట్లుగా చర్చలు జరుగుతున్నాయి. నాగర్‌కర్నూల్ స్థానంలో మూడు జిల్లాల పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో అచ్చంపేట, అలంపూర్ అసెంబ్లీ స్థా నాలు ఎస్సీ రిజర్వుడు. మహబూబ్‌నగర్ స్థా నంతో పోలిస్తే నామినేషన్లు ఇలా తక్కువ సం ఖ్యలో రావడం చర్చకు దారి తీస్తోంది.

ఈ స్థానానికి ఎవరెవరూ నామినషన్లు వేస్తారు, ఎంత మం ది బరిలో ఉంటారోననే ఆసక్తి నెలకొంది. చివరగా సోమవారం ఒక్క రోజు మిగిలి ఉండటంతో ఎన్ని నామినేషన్లు వస్తాయో, పోటీ చేసేందుకు ముందుకొచ్చే అభ్యర్థులు ఎవరో సోమవారం స్పష్టత రానుంది. మంగళవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. చివరగా ఈ నెల 28న నామినేషన్ల ఉపసంహరణతో నామినేషన్ల ఘట్టం పూర్తవుతుంది. అదే రోజు బరిలో నిలిచే అభ్యర్థులు ఎవ్వరో తేలుతుంది. ఇక జాతీయ, రాష్ట్ర పార్టీలతో పాటుగా స్వతంత్రులకు పేర్లను బట్టి బ్యాలెట్‌లను రూపొందించే వీలుంటుంది. ఈ పార్లమెంట్ స్థానంలో గెలుపును టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. కేం ద్రంలో ఫెడరల్ ఫ్రంట్‌కు నాయకత్వం వహించి దేశ రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న ప్ర యత్నాలతో ఈ ఎంపీ ఎన్నికలు గతానికి భిన్నంగా జరుగబోతున్నాయి. అయితే ఇతర పార్టీల బలం గతంతో పోలిస్తే చాలా తగ్గింది. అయినా ఎలైగనా కందనూలు పార్లమెంట్‌పై జెండా ఎగరేయాలనే ప్రయత్నాలు చేపట్టాయి. ఇలా ఏప్రిల్ 11న జరిగే ఈ ఎన్నికలకు గాను ఇప్పటికే అధికారులు అధికారుల నియామకం, పోలింగ్ సౌకర్యాల కల్పనలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నామినేషన్ల పర్వం పూర్తైతే అధికారులు పూర్తిస్థాయిలో పోలింగ్ నిర్వహణపై దృష్టి సారించనున్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...