ఎన్నికలు సజావుగా నిర్వహించాలి


Mon,March 25, 2019 02:41 AM

- జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి
నాగర్‌కర్నూల్‌టౌన్ : ప్రతి ఉద్యోగి ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించి ఎన్నికలు సజావుగా కొనసాగేలా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు పట్టణంలోని మూడు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఎన్నికల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఉయ్యాలవాడలోని సుఖజీవన్‌రెడ్డి గార్డెన్‌లో శిక్షణ తరగతులను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది అంకితభావంతో పని చేయాలని, ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి ఎన్నికల సంఘానికి జవాబుదారిగా ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు బాధ్యతాయుతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా విధులు నిర్వహించాలని, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ఎలాంటి అవకతవకలకు పాల్పడ్డా, పొరపాట్లు చేసినా ఎన్నికల సంఘం తీసుకునే కఠిన శిక్షలకు అర్హులవుతారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పని చేయాలని సూచించారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు కరదీపికను పంపిణి చేశారు. ప్రతి అంశంపై సవివరంగా కరదీపికల యందు రూపొందించారన్నారు. ప్రతి ఒక్కరూ కరదీపికలను క్షుణంగా చదవాలని కోరారు. నేడు నిర్వహించిన ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరుకాని సిబ్బందికి శాఖా పరమైన చర్యలు తీసుకునేందుకు జిల్లా ఎన్నికల అధికారి వారి పేర్లను సిఫారస్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఈవో గోవిందరాజులు, వ్యవసాయాధికారి సింగారెడ్డి, డీఆర్‌డీఏ సుధాకర్, ఎన్నికల విధులకు హజరయ్యే ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...