పొరపాట్లకు తావివ్వొద్దు


Sun,March 24, 2019 12:56 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బంది ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ శ్వేతామొహంతి సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరే ట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పీవో, ఏపీవో లు పోలింగ్ స్టేషన్‌లలో ఏర్పాటు చేసుకునే ముఖ్యమైన విషయాల గురించి పవర్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ శిక్షకులకు, సెక్టోరియల్ అధికారులకు వివరించారు. ముఖ్యం గా పీవో డైలి నిర్వహణ, పోలింగ్ ఏజెంట్ల మాక్ పోలింగ్ అయిన తర్వాత తీసుకునే చర్యల గురించి తెలియజేశారు. అనంతరం కలెక్టర్ శ్వేతామొహంతి మాట్లాడుతూ ఈవీఎ ంలు, వీవీ ప్యాట్‌లు ఒక రోజు ముందుగానే పోలింగ్ స్టేషన్‌లకు చేరుకుంటాయని అవి సరిగ్గా ఉన్నాయా లేనివి సరిచూసుకోవాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలన్నారు. ఈడీసీవో వివరా లు, పోలింగ్ కాగానే ఈవీఎం, వీవీ ప్యాట్‌ల పోలింగ్, పీఆర్‌వో డిక్లరేషన్ గురించి అ వగాహన కల్పించాలన్నా రు. కార్యక్రమంలో జేసీ వేణుగోపాల్, తహసీల్దార్ రాజేందర్‌గౌడ్, సెక్టోరియల్ అధికారులు, మాస్టర్ శిక్షకులు తదితరులు ఉన్నారు.

ప్రజా ప్రతినిధుల సమక్షంలో సీల్ చేస్తాం..
వివిధ పార్టీల ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈవీఎం, వీవీ ప్యాట్‌లకు సీల్ చేయడం జరుగుతుందని ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయ ంలోని సమావేశ మందిరంలో వివిధ పార్టీల ప్రతినిధులతో ఈవీఎం, వీవీ ప్యాట్ ర్యాండమైజేషన్ గురించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 290 పోలింగ్ స్టేషన్లకు గాను ఈవీఎంలు సిద్ధంగా ఉన్నాయని, అదనంగా మరో 30 ఈవీఎంలు రిజర్వ్‌లో ఉంచామన్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌లను ప్రత్యేక అధికారులచే పూర్తి స్థాయిలో చెక్ చేయించటం జరుగుతుంద న్నారు. ప్రజాప్రజాప్రతినిధుల సమక్షంలో పోలింగ్ స్టేషన్ల వారిగా చెక్ చేయించి సీల్ వేయటం జరుగుతుందన్నారు. వచ్చే నెలలో ఎన్నికల పరిశీలకులు వస్తున్నందున ఆయన సమక్షంలో ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు పూర్తిగా పరిశీలించి సీల్ చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజాప్రతిని ధులు ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని సూ చించారు. కార్యక్రమంలో జేసీ వేణుగోపాల్, తహసీల్దార్ శంకర్‌గౌడ్, వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...