శిక్షణకు హాజరుకాకుంటే జీతం నిలిపేస్తాం


Sun,March 24, 2019 12:55 AM

నాగర్‌కర్నూల్ టౌన్ : లోక్‌సభ ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరుకాని అధికారులు, సిబ్బంది జీతాన్ని నిలిపివేస్తామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ సిబ్బందికి ఎలక్షన్ డ్యూటీ ఆర్డ ర్, పోస్టల్ బ్యాలెట్, ఎన్నికల శిక్షణ కార్యక్రమాలపై సంబంధిత నోడల్ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ స ందర్భ ంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధు లు కేటాయించిన ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్ లేదా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలన్నారు. ఇప్పటి వరకు జారీ చేసిన ఎన్నికల డ్యూ టీ ఉత్తర్వులు, సేకరించిన పో స్టల్ బ్యాలె ట్, ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్లు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ముఖ్యంగా విద్యా, వైద్యం, ఆరోగ్యశాఖలో ఎక్కువ మంది ఉద్యోగులను విధుల్లో కేటాయించడం జరిగిందన్నారు. ఎన్నికల విధులకు నియమించబడిన ఉద్యోగులందరూ త ప్పనిసరిగా ఈ నెల 24న నిర్వహించే శిక్ష ణ కార్యక్రమానికి హాజరు కావాలని, లే దంటే వారి వివరాలను జిల్లా కోశాధికారి కార్యాలయానికి పంపి వారి జీతాన్ని నిలిపివేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. శిక్షణ కార్యక్రమానికి ఆలస్యంగా హజరయ్యే ఉద్యోగుల ప్రయాణ భత్యా న్ని తగ్గించి ఇస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల విధులకు హజరయ్యే ఉద్యోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు సం బంధించి రవాణా సదుపాయం కల్పించాలని అన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఫ్యాన్ సౌకర్యం లేని 700ల పై చిలు కు పోలింగ్ కేంద్రాల్లో వెంటనే ఫ్యాన్ సదుపాయం కల్పించాలన్నారు. విధుల కు హజరయ్యే సిబ్బందికి మంచి భోజ నం ఏర్పాటు చేయాలని డీఈవోను ఆదేశించారు. పోలింగ్ ముగిసిన తర్వాత చే సే కౌటింగ్‌లో ఎలాంటి అవకతవకలు జ రిగిన సంబంధిత ప్రిసైడింగ్ అధికారిపై చ ర్య తీసుకుంటారని, ఈ విషయాన్ని శిక్ష ణ కార్యక్రమంలో స్పష్టంగా తెలియజేయాలని ట్రైనింగ్ నోడల్ అధికారి సుధాకర్, డీఈవో గోవిందరాజులును ఆయన ఆదేశించారు. సమావేశంలో ఎన్నికల నోడల్ అధికారులతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...