భగత్‌సింగ్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం..


Sun,March 24, 2019 12:55 AM

వనపర్తి విద్యావిభాగం/వనపర్తి రూరల్/రేవల్లి/ఖిల్లాఘణపురం : భగత్‌సింగ్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ కార్మిక భవనంలో ఐఎఫ్‌టీయూ జిల్లా సదస్సు నిర్వహించారు. ముందుగా భగత్‌సింగ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సూర్యం మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దళితులపై, కార్మికులపై దాడులు చేసి ప్రజలను అణిచివేస్తున్నారని, ఈ దాడులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో కవి, గాయకుడు రాజారాం ప్రకాష్ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ వర్ధంతిని నిర్వహించారు. అలాగే వనపర్తి మండలం అంకూర్ గ్రామంలో అమరవీరుల స్థూపం వద్ద అంకూర్ మహాలంక సొసైటీ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ వర్ధంతిని నిర్వహించారు. రేవల్లి మండలం చెన్నారం గ్రామంలో హిందువాహిణి, ఆర్‌ఎస్‌ఎస్‌ల ఆధ్వర్యంలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సఖ్‌దేవ్‌ల వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఖిల్లాఘణపురంలో భగత్‌సింగ్ వర్ధంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు అరుణ్‌కుమార్, జిల్లా కార్యదర్శి సాంబశివుడు, నాయకుడు గీతాబాయ్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు గణేష్, రాజన్న, ప్రసాద్, రాజు, చింతలమ్మ, సామేల్, కిష్టన్న, కర్రెన్న, రవి, గోవిందమ్మ, బుచ్చమ్మ, బక్కమ్మ, కొండమ్మ, ఎంఈఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణ, యూటీఎఫ్ జిల్లా నాయకుడు వెంకటేష్, బీటీఏ, పీఆర్‌టీయూ నాయకులు వెంకటస్వామి, రవీందర్‌గౌడ్, ఉపాధ్యాయ సంఘ నాయకులు నరసింహా, విజయ్‌కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు బుచ్చన్న, బీచుపల్లి, వాల్మీకి సంఘ నాయకులు బీసన్ననాయుడు, బాలస్వామి, కృష్ణయ్య, శివశంకర్, మహాలంక సొసైటీ అధ్యక్షుడు సేనపతి, సభ్యులు విజయ్‌సాగర్, నరేందర్‌రెడ్డి, కుమార్, ప్రసాద్, బాలకృష్ణ, రాము, సతీష్, సత్యనారాయణ, మల్లేష్, నరేష్, రాము, విశ్వబ్రహ్మాణ సంఘం మండలాధ్యక్షుడు కమ్మర్‌గోపి పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...