2025 వరకు..టీబీని రూపుమాపుదాం


Sat,March 23, 2019 02:33 AM

వనపర్తి వైద్యం : ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా 2025 సంవత్సరం వరకు టీబీని రూపుమాపుదామని కలెక్టర్ శ్వేతామొహంతి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీబీ రహిత కలర్‌పుల్ సమాజం కోసం అందరు టీబీ డాక్టర్స్ కలర్‌పుల్ చేతిల గుర్తులతో ఫ్లెక్సీని తయారుచేసి టీబీ నియంత్రణలో భాగస్వాములు కావాలన్నారు. 2025 సంవత్సరం వరకు రాష్ట్రంలో టీబీ లేని జిల్లాగా వనపర్తి జిల్లా పేరు ముందుడాలని, అందుకు వైద్య సిబ్బంది విధులను నిర్వహించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు, ప్రొగ్రాం ఆఫీసర్ రవిశంకర్, డాక్టర్లు శంకర్, జోషి, బాలమణి, వైద్య సిబ్బంది ఉన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...