ఇరు రాష్ర్టాల అధికారులు.. సమన్వయంతో పనిచేయాలి


Sat,March 23, 2019 02:32 AM

నారాయణపేట రూరల్ : ఇరు రాష్ర్టాల అధికారు లు సమన్వయంతో పని చేయాలని నారాయణపేట కలెక్టర్ వెంకట్‌రావు, యాద్గీర్ కలెక్టర్ కుర్మారావు ఎ స్పీలకు సూచించారు. శుక్రవారం రాష్ట్ర సరిహద్దు గ్రా మమైన జిలాల్‌పూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో తె లంగాణ, కర్నాటక రాష్ర్టాల కలెక్టర్లు, ఎస్పీలు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చెక్‌పోస్టుల నిర్వహణపై సమావేశాన్ని నిర్వహించారు. నారాయణపేట జిల్లా కలెక్టర్, యాద్గీర్ కలెక్టర్, పేట ఎస్పీ చేతన, యాద్గీర్ ఎస్పీ సోనియా వానే హృషికేష్‌లు ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రం లో ఏప్రిల్11న ఎన్నికలు ముగిసినప్పటికీ సరిహద్దు లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను కర్నాటకలో ఎన్నికలు ముగిసేంత వరకు కొనసాగించాలని అధికారు లు నిర్ణయించారు. కర్నాటక నుంచి అక్రమంగా డబ్బులు, మద్యం రవాణా చేస్తూ పట్టుబడితే కర్నాటక పోలీసులు కేసులు నమోదు చేయాలని, అదే విధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా డ బ్బులు, మద్యం రవాణా చేస్తూ పట్టుబడితే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు.

బెల్లం అక్రమ రవాణాను అరికట్టాలని, బెల్లం తరలించే వారిని గుర్తించి బైండోవర్ చేయాలని ఎక్సైజ్ అధికారులకు కలెక్టర్లు సూచించారు. మరలా పట్టుబడితే కేసులు నమోదు చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ర్టానికి చెందిన కొందరు కర్నాటకకు వచ్చి తమ ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని తమకు ఫిర్యాదులు అందాయని యాద్గీర్ కలెక్టర్ కుర్మారావు, పేట కలెక్టర్ వెంకట్‌రావు, ఎస్పీ చేతన దృష్టికి తీసుకురాగా ఎన్నికల అనంతరం ఈ విషయంపై ప్రత్యేక కార్యచరణ రూపొందించి ఇసుక రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపడతామన్నారు. సరిహద్దులో ఉన్న చెక్ పోస్టులను తనిఖీ చేసిన కలెక్టర్‌లు, ఎస్పీలు వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని సిబ్బందికి తెలిపారు. చెక్ పోస్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి వాహనాలను పరిశీలించాలన్నారు. రెండు రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు ఇరు రాష్ర్టాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్లు అధికారులకు సూచించారు. ఉమ్మడి రాష్ర్టాల పేరుతో చెక్ పోస్టు వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో యాద్గీర్ ఎక్సైజ్ డీసీ నరేంద్రకుమార్, సీఐ ప్రకాశ్, పేట సీఐ సంపత్, ఎస్‌ఐ శ్రీనివాస్, ఎక్సైజ్ సీఐలు నాగేందర్‌గౌడ్, విజయ్‌భాస్కర్, వీరారెడ్డిలతో పాటు డీటీ ప్రమీల, ఎంపీడీవో వెంకటయ్య పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...