ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి


Sat,March 23, 2019 02:32 AM

వనపర్తి రూరల్ : పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆర్డీవో చంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ గణేష్, మున్సిపల్ కమిషనర్ రజినీకాంత్ కుమార్, జిల్లా మోప్మా, మహిళా సంఘ అధికారులు, సభ్యులు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన ర్యాలీని ఆర్డీవో జెండా ఊపి ప్రారంభించారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణం నుంచి రాజీవ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, చౌరస్తాలో మానవహారం, అనంతరం ఓటు వినియోగంపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్, కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి ఓటరూ తన ఓటును తప్పక వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 30 వరకు ఓటు హక్కు వినియోగంపై ప్రతి రోజూ వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా పలువురు ప్రలోభాలకు గురిచేస్తుంటారని, వాటిని తిరస్కరించాలని తెలిపారు. ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే సామాజిక ఆయుధం ఓటు అని, దానిని మందు, డబ్బులకు అమ్ముకోవద్దని, తమ కోసం న్యాయంగా పరిపాలించే వ్యక్తులను గుర్తించి ఓటు ద్వారా ఎన్నుకోవాలని తెలిపారు. వచ్చే నెల 11వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయ సిబ్బంది, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, మహిళా సంఘం సభ్యులు, మోప్మా తదితరులు పాల్గొన్నారు.

ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత
పెద్దమందడి : ఓటుహక్కు ప్రతి ఒక్కరి బాధ్యత అని ఓటు హక్కును అందరు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీ వో సాయిబ్రిందా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం నుంచి గ్రంథాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మానవహారం చేసి ఓటుహక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగరాజు, ఈవోఆర్డీ భానుప్రసాద్, ఎంఈవో జయశంకర్, ఆయా శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...