ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి


Sat,March 23, 2019 02:32 AM

పెబ్బేరు టౌన్ : ఎన్నికలలో ప్రజ లు తమ ఓటు హ క్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అలాగే ఎన్నికల నియమనిబంధనలను ఉల్లంఘించరాదని డీఎస్పీ సృజన అన్నారు. వనపర్తి ఎస్పీ ఆపూర్వరా వు ఆదేశాల మేర కు పెబ్బేరు మండ ల కేంద్రంలోని కొరంతోట కాలనీ లో శుక్రవారం ఉదయం 5 గంట ల నుంచి 8 గంట ల వరకు డీఎస్పీ సృజన ఆధ్వర్యం లో కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీ ఎస్పీ కాలనీ వాసులతో మాట్లాడు తూ ప్రజలకు మె రుగైన భద్రత కల్పి ంచడం కోసమే కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని ప్రతి గ్రా మంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. మీ కాలనీలలో ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా అగుపిస్తే వేంటనే పోలీసులకు సమాచా రం ఇవ్వలని, లే దా 100 నెంబర్ కు కాల్ చేయాలని తెలిపారు. తగిన ఆధారాలుంటేనే కొత్త వ్యక్తులు ఇ ల్లును అద్దెకు ఇవ్వాలని సూచించారు. యువత మద్యం.. మత్తు పదార్థాలకు ఆలవాటుపడరాదని, మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రజలంతా సహాకరించాలని కోరారు. వాహనదారులంత తమ వాహనాలకు సం బంధించిన పత్రాలను అందుబాటు లో ఉంచుకోవాలన్నారు. ఈ కార్డెన్ సెర్చ్‌లో వాహన పత్రాలు చూపించని 23 మోటార్ సైకిళ్లను, 2 ఆటోలను, ఒక కారు డిటైన్ చేయడం జరిగిందని ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు. అనంతరం 20 మంది పోలీస్ సిబ్బంది, 40 మంది సీఐఎస్‌ఎఫ్ పోలీసులతో మండలంలోని తోమలపల్లి, బున్యాదిపూర గ్రామాలలో ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో కొత్తకోట సీఐ వెంకటేశ్వర్ రావు, ఎస్‌ఐ రవికాంత్, పెద్దమందడి ఎస్‌ఐ విజయ్‌భాస్కర్ పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...