క్రమశిక్షణతోనే..ఉన్నత లక్ష్యం సాధ్యం..


Fri,March 22, 2019 03:04 AM

వనపర్తి రూరల్ : ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యం చేరాలంటే తప్పక క్రమశిక్షణతో కూడిన ఓర్పుండాలని విద్యార్థులకు జిల్లా బీసీ గురుకుల పాఠశాలల కన్వీనర్ వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. మండలంలోని నాగవరం గ్రామంలోని పెబ్బేర్ మహాత్మాజ్యోతిబాఫూలే బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం రాత్రి జరిగిన పాఠశాల వార్షికోత్సంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంలో బీసీ గురుకుల పాఠశాలల ఏర్పాటుతో పేదబలహీన విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తుందన్నారు.తెలంగాణ ప్ర భుత్వం ప్రతి విద్యార్థి కోసం రూ.లక్షకు పైగా ఖర్చు చే స్తుందన్నారు. ప్రైవేట్ రంగంలోని విద్యార్థులకంటే వందశాతం మెరుగైన విద్యను విద్యార్థులకు అందించేందుకు బీసీ గురుకుల సెక్రటరీ మల్లయ్యబట్టు కృషి చేస్తున్నారన్నారు. అన్ని రంగాలలో రాణించేలా కార్యక్రమాలను నిర్వహించి శిక్షణను అందింస్తుందని తెలిపారు. 8వతరగతి నుంచి విద్యార్థులకు నీట్, జేఈఈ, సీఏ కోర్సుల పై ప్రత్యేక కోచింగ్ ఇవ్వటం జరుగుతుందన్నారు. ఇంటర్ విద్యార్థులకు నీట్, ఇంజినీరింగ్ ఎం ట్రన్స్‌లపై హైదరాబాద్‌లో విద్యార్థులకు శిక్షణ అందిస్తుందన్నారు. వచ్చే విద్యసంవత్సరం రాష్ట్రంలో మరో 119 బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చే యడానికి ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిందన్నారు. అనంతరం విద్యార్థినుల సాంస్కృతిక, జానపద, దేశభక్తి నృత్యలు అలరించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బోజ్జయ్య, ఉపాధ్యాయ బృం దం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...