పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగాలి


Fri,March 22, 2019 03:04 AM

కొత్తకోట : పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా నిర్వహించేందుకు కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామని డీఎస్పీ సృజన అన్నారు. గురువారం పట్టణంలోని గ్రంథాలయం వీధి, కుమ్మరి వీధిలో సుమారు 1500 ఇండ్లలో తనిఖీలు చేపట్టి కార్డన్ సర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. వచ్చే పార్టమెంట్ ఎన్నికల దృష్ట్యా మద్యం, డబ్బులు ఉంటాయన్న సం దేహాలతో అక్కడక్కడ ము మ్మరంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. ఇండ్లలో తనిఖీ లు చేసి ధ్రువపత్రాలు లేని 33 వాహనాలను స్వాధీనం చేసుకొని ఠాణాకు తరలించినట్లు తెలిపారు. 18ఏళ్లు నిం డని యువకులు మోటర్ సైకిల్ నడిపితే వారి తల్లిదండ్రులపై పోలీస్ కేసు నమోదు చేసి ఆర్టీఐ డిపార్ట్‌మెంట్‌కు నోటీసులు పంపిస్తామని తెలిపారు.

ఆర్టీఐ వారు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు జరిమానా విధిస్తారని, ఈ నిబంధనలు హైదరాబాద్‌లో అమలవుతున్నాయని, త్వరలో వనపర్తి జిల్లాలో కూడా అమలు చేస్తామన్నారు. ఓటు అనేది మన జన్మహక్కు అని దానిని స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. మద్యానికి, డబ్బుకు బానిసలు కాకుండా నిజాయితీగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్టన్ సర్చ్ సీఆర్‌సీఎఫ్ సిబ్బంది 50 మంది, పోలీస్ సిబ్బంది 40 మంది, నలుగురు ఎస్సై లు, ఒక సీఐ సర్చ్‌లో ఉన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రవికాంతరావు, పోలీస్ సి బ్బంది తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...